పేదలు బంగారం కొనడం మానుకోవాల్సిందే.. ఈ ఏడాది ధరల పెరుగుదలపై ICBC స్టాండర్డ్ బ్యాంక్‌ సంచలన నివేదిక..

ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు బుధవారం గత రికార్డులను బద్దలు కొట్టాయి. ఒక్క ఔన్సు బంగారం ధర ఏకంగా 4,800 డాలర్లకు పైగా చేరుకుని పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. అమెరికా నుంచి వస్తున్న సుంకాల (టారిఫ్‌లు) బెదిరింపులతో పాటుగా ప్రపంచ వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరే అవకాశాలపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడం బంగారం భారీ ర్యాలీకి ప్రధాన కారణంగా మారింది. క్లిష్ట పరిస్థితుల్లో సేఫ్ హావెన్‌గా భావించే బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది.

ఈ తాజా పెరుగుదలతో బంగారం భవిష్యత్తు ధరలపై ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకుల మధ్య చర్చ మళ్లీ వేడెక్కింది. ఇప్పటికే 2025 సంవత్సరం బంగారానికి బ్లాక్‌బస్టర్ ఏడాదిగా నిలిచింది. వరుసగా రికార్డులను బద్దలు కొట్టిన Gold, అదే జోరును ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాస్తవ వడ్డీ రేట్లు తగ్గడం, డాలర్‌పై ఆధారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలు కలిసి బంగారాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మరింత కీలకమైన ఆస్తిగా మార్చుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

gold price today gold hits new record gold all-time high gold price surge gold price forecast gold 7000 target greenland tariff threats trade tariff fears safe haven gold gold rally news global trade tensions gold market outlook gold investment gold demand surge geopolitical risk gold precious metals rally gold price prediction gold breaks record 7 000
Photo Credit:

లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు ఈ ఏడాది బంగారం ధరలు 5 వేల డాలర్లకు పైగా వెళ్లే అవకాశముందని అంచనా వేశారు. అమెరికాలో తక్కువ వాస్తవ వడ్డీ రేట్లు, ఫెడరల్ రిజర్వ్ నుంచి కొనసాగుతున్న విధాన సడలింపులు, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకోవడం ఈ అంచనాలకు బలమైన కారణాలుగా విశ్లేషకులు పేర్కొన్నారు. 2025లో రికార్డులు బద్దలైన తర్వాత కూడా బంగారం ఇంకా మార్కెట్‌లో ప్రధాన ఆకర్షణగా కొనసాగుతోందని LBMA సర్వేలో స్పష్టం అయింది.

ICBC స్టాండర్డ్ బ్యాంక్‌కు చెందిన సీనియర్ కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ జూలియా డు తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధరలు రానున్న కాలంలో 7,150 డాలర్ల వరకు కూడా వెళ్లవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో గోల్డ్‌మన్ సాచ్స్ కూడా బంగారం మీద తన బుల్లిష్ వైఖరిని వెల్లడించింది. బంగారాన్ని ప్రస్తుతం అత్యధిక నమ్మకంతో పెట్టుబడి పెట్టదగిన ఆస్తిగా అభివర్ణించింది. బంగారాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారన్న మార్పే ఈ ర్యాలీకి అసలు బలమని గోల్డ్‌మన్ సాచ్స్ విశ్లేషణ చెబుతోంది.

గోల్డ్‌మన్ సాచ్స్ గ్లోబల్ కమోడిటీస్ రీసెర్చ్ సహ-హెడ్ డాన్ స్ట్రూయ్వెన్ మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర 4,900 డాలర్ల వరకు చేరడం తమ ప్రాథమిక అంచనాగా వెల్లడించారు. 2023, 2024లో కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలకు మద్దతుగా నిలిచాయని, 2025లో ప్రైవేట్ రంగ పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ర్యాలీ మరింత వేగం పుంజుకుందని ఆయన వివరించారు. ప్రైవేట్ పెట్టుబడిదారులు, సంపద నిర్వహణ సంస్థలు, హెడ్జ్ ఫండ్‌లు, పెన్షన్ ఫండ్లు బంగారంలోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ETFల ద్వారా వచ్చే పెట్టుబడులు ఈ మార్పుకు స్పష్టమైన నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

మరోవైపు MKS PAMPలో మెటల్స్ స్ట్రాటజీ హెడ్ నిక్కీ షీల్స్ మాట్లాడుతూ.. ప్రస్తుత బంగారం చక్రం ఊహాజనిత బుడగలా ముగిసిపోయే స్థాయిలో లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బంగారం ధరలు 5,400 డాలర్ల వరకు చేరే అవకాశముందని అంచనా వేశారు. గత ఏడాది విలువైన లోహాల మార్కెట్‌లో వంద సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనిపించే స్థాయిలో అసాధారణ పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు. వెండి దాదాపు రెట్టింపు కాగా.. బంగారం ధర సుమారు 60 శాతం పెరిగిందని ఆమె గుర్తుచేశారు. ఆ స్థాయి లాభాలు మళ్లీ రాకపోయినా.. బంగారం మరో 30 శాతం పెరగడం అసాధ్యం కాదని తేల్చి చెప్పారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదని షీల్స్ అభిప్రాయపడ్డారు. వెనిజులాపై అమెరికా చర్యలు, గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ సాధించేందుకు వాషింగ్టన్ చూపుతున్న ఆసక్తి వంటి అంశాలు పెట్టుబడిదారులను మరింతగా బంగారం వైపు ఆకర్షిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కీలక లోహాలు, కీలక వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న దశాబ్దంలోకి మనం అడుగుపెడుతున్నామని.. ఆ పరిస్థితుల్లో బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+