బంగారం ముట్టుకుంటే భగ్గుమంటోంది. పసిడి ధరలు నింగిని తాకి నేలకు దిగిరానంటున్నాయి. ఇప్పటికే బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. తర్వలో ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 10 వేల నుంచి లక్షా యాభై వేల వరకు చేరుకోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ రిపోర్టు చూసిన పసిడి ప్రియులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.కాగా ఏప్రిల్ నెలలో తులం బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1,01,600 పలికింది.
తాజాగా ఈ రోజు బంగారం ధర మళ్లీ లక్షను తాకింది. నేడు అహ్మదాబాద్‌లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,00,065 కు చేరుకున్నాయి. ఇక మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం 10 గ్రాముల ధర రూ. 97, 953 వద్ద ముగిసింది.

జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగితే..ముందు ఎలా ఉంటుందోనని పసిడి ప్రియులు బెంబేలెత్తుతున్నారు. ఉక్రెయిన్, రష్యా మధ్య పెరిగిన ఉద్రిక్తతలు తాజాగా బంగారం పెరుగుదలకు ప్రధాన కారణం అయ్యాయి. ఇప్పటికే చైనా -అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్దం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లు రూ.9,88,40 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,06,00గా ఉంది. 18 క్యారెట్లు రూ.7,41,30 పలుకుతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,850 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,610 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,140 వద్ద ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలోనూ ఈ ధరలే కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక సంచలన విషయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది ఆఖరుకల్లా బంగారం 24 క్యారెట్ 10 గ్రాముల రేటు లక్షా యాభై వేల వరకు చేరుకోవచ్చనే తెలిపింది. ప్రపంచ మార్కెట్లో 2025 చివరి నాటికి ఔన్స్ గోల్డ్ రేటు గరిష్ఠంగా 4,500 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
చైనా.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. చైనా కూడా ధీటుగా బదువివ్వడంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ఆందోళనతో కూడిన భయాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల మధ్య అమెరికా- చైనా మధ్య ఈ వారం చివర్లో కీలకమైన సమావేశం జరగనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇక మరో అంశంలో ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడి పైగా రష్యన్ విమానాలను ధ్వంసం చేసిందని వార్తలు ప్రపంచ మార్కెట్లకు దడ పుట్టించాయి. ఈ రెండు దేశాల యుద్దవాతావరణంతో మార్కెట్ల పరిస్థితి మళ్లీ ఆందోళనకరంగా మారింది. నిన్న రెండు దేశాలు సమావేశమైనప్పటికీ పరిస్థితులు చక్కబడలేదు. చర్చలు కొలిక్కిరాలేదు.
ఈ అంశాలు కూడా బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడి చేస్తాయనే భయాలు కూడా వెంటాడుతున్నాయి. ఈ భయాల ప్రభావం కూడా ప్రపంచ మార్కెట్లపై పడింది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold silver: బంగారం, వెండి ధరల్లో మళ్ళీ కదలిక.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ఎలా ఉందంటే..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications