మంగళవారం (నవంబర్ 25) బంగారం ధరలు MCXలో ప్రారంభ లావాదేవీల్లోనే ఒక శాతం కంటే ఎక్కువ పెరిగి పెట్టుబడిదారుల ఆసక్తిని మళ్లీ బంగారంపైనే కేంద్రీకరించాయి. డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు గత వారంతో పోలిస్తే మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు పెరిగాయి.
దీనికి తోడు దేశీయంగా వివాహ సీజన్ కొనసాగుతుండటంతో స్పాట్ డిమాండ్ బలంగా ఉండి..ధరలు మరింత స్థిరంగా ఎగిసేలా చేసింది. ఉదయం 9:15 గంటలకు MCX గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.1,25,106 వద్ద ట్రేడ్ అవుతూ 1 శాతం పెరుగుదల చూపాయి. అదే సమయంలో MCX సిల్వర్ డిసెంబర్ కాంట్రాక్టులు కూడా 1.34 శాతం లాభంతో కిలోకు రూ. 1,56,551 చేరుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో Gold ధరలు ముందురోజు దాదాపు 2 శాతం వరకు ఎగిసాయి. అమెరికా వడ్డీ రేట్లలో త్వరలో మార్పు వస్తుందనే సంకేతాలు దీనికి ప్రధాన కారణం. న్యూయార్క్ ఫెడ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో వడ్డీ రేట్లు తగ్గించడం ఫెడ్ ద్రవ్యోల్బణ నియంత్రణ ప్రయత్నాలకు హాని చేయదని, అలాగే ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు పెట్టుబడిదారులలో విశ్వాసాన్ని పెంచగా, ఫెడ్ రేటు కోత అంచనాలు వేగంగా పెరిగాయి.

CME ఫెడ్‌వాచ్ టూల్ తాజా డేటా ప్రకారం డిసెంబర్‌లో రేటు తగ్గింపు అవకాశాన్ని ఇప్పుడు మార్కెట్ 81 శాతంగా అంచనా వేస్తోంది. ఇది గత వారం ఉన్న 40 శాతంతో పోలిస్తే భారీ పెరుగుదల. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరగటం స్వాభావికం, ఎందుకంటే పసిడి స్వయంగా వడ్డీ ఇచ్చినా.. ఇవ్వకపోయినా సేఫ్ హెవెన్ గా నిలుస్తోంది. ఇతర పెట్టుబడులు తక్కువ రాబడిని ఇవ్వడం వల్ల కూడా బంగారం మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా విడుదలలో ఆలస్యం అయిన రిటైల్ సేల్స్, నిరుద్యోగ క్లెయిమ్‌లు, నిర్మాతల ధర గణాంకాలు ఇప్పుడు మార్కెట్లో కీలకంగా మారాయి. ఈ డేటా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలకు భవిష్యత్ సూచికగా పరిగణించబడేందున.. ప్రతీ అప్‌డేట్ పెట్టుబడిదారుల భావోద్వేగాలను ప్రభావితం చేస్తోంది. ఇదే సమయంలో, భారతదేశంలో వివాహ సీజన్ కొనసాగుతుండటంతో బంగారం కొనుగోళ్లలో పెరుగుదల కనిపిస్తోంది.
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ ప్రకారం.. బంగారం ప్రస్తుతం పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో బలమైన స్థిరీకరణ ఆస్తిగా వ్యవహరిస్తోంది. ఆమె మాటల్లో దేశీయంగా వివాహాల డిమాండ్, ద్రవ్యోల్బణం, కరెన్సీ రిస్క్‌లకు వ్యతిరేకంగా బంగారం చూపే రక్షణాత్మక స్వభావం ధరలను ఆదుకుంటోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో బలమైన US డాలర్, వివిధ కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధాన మార్పులు స్వల్పకాలిక లాభాలను కొంత నియంత్రించవచ్చని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశీయంగా బంగారంపై పెట్టుబడి ప్రవాహం స్థిరంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
మెహతా ఈక్విటీస్ విశ్లేషకుడు రాహుల్ కలాంత్రి అభిప్రాయం ప్రకారం.. గ్లోబల్ మార్కెట్లో బంగారానికి 4,100 డాలర్, 4,065 డాలర్ల వద్ద ప్రధాన సపోర్ట్ కనిపిస్తుంది. ధరలు దిగివస్తే ఇవే కీలక మద్దతుగా మారవచ్చు. అదే సమయంలో 4,170 డాలర్ల నుండి 4,195డాలర్ల వద్ద ఉన్న రెసిస్టెన్స్ స్థాయిలను ధరలు దాటితే మరింత పెరుగుదల సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. వెండి విషయంలో కూడా 51 డాలర్ల నుండి 50.65 డాలర్లు మద్దతు స్థాయిలుగా (కొనుగోలు స్థాయి) ఉండగా.. 51.70 డాలర్ల నుండి 52.10 డాలర్లు కీలక ప్రతిఘటన స్థాయిలుగా (కొనుగోలు ఆపే స్థాయి) పరిగణించాల్సి ఉంటుంది.
MCXలో రూపాయల విలువలో అదే స్థాయిలను పరిశీలిస్తే.. బంగారానికి రూ. 1,23,150 నుండి రూ. 1,22,580 వద్ద బలమైన సపోర్ట్ (కొనుగోలు స్థాయి) కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎగబాకాలంటే రూ. 1,24,650 నుండి రూ.1,25,200 రెసిస్టెన్స్ స్థాయిలను అధిగమించాలి. వెండి కూడా రూ. 1,53,650, రూ. 1,52,800 వద్ద మద్దతు సాధించగా, రూ. 1,56,140 రూ. 1,57,000 వద్ద ఉన్న ప్రతిఘటన స్థాయిలు ధరల పెరుగుదలకు కీలక సూచికగా కనిపిస్తున్నాయి.
ఇక పృథ్వీఫిన్‌మార్ట్‌కు చెందిన మనోజ్ జైన్ కూడా ఇలాంటి స్థాయిల్నే సూచించారు. MCXలో బంగారం రూ. 1,24,700, రూ.1,24,100 మధ్య సపోర్ట్ (కొనుగోలు స్థాయి) పొందుతుందని, రూ. 1,26,200 రూ. 1,27,000 రెసిస్టెన్స్‌గా (కొనుగోలు ఆపే స్థాయి)గా వ్యవహరిస్తాయని ఆయన తెలిపారు. వెండికి రూ. 1,53,100, రూ.1,52,000 వద్ద మద్దతు లభిస్తోందని అలాగే రూ.1,56,600 రూ. 1,58,000 వద్ద రెసిస్టెన్స్ ఉన్నట్లు తెలిపారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications