సోమవారం ఆసియా ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర (XAU/USD) భారీగా పెరిగి ఔన్స్‌కు సుమారు 5,045 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) భవిష్యత్ వడ్డీ విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈ విలువైన లోహం ధరలు నింగిని తాకుతున్నాయి.
ప్రపంచ రాజకీయ పరిణామాలు Gold ధరలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగియకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య జరిగిన మొదటి త్రిముఖ శాంతి చర్చలు అబుదాబిలో ఎలాంటి స్పష్టమైన పురోగతి లేకుండానే ముగిశాయని బీబీసీ నివేదించింది. యుద్ధం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఈ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వచ్చే వారం ప్రారంభంలో మరో సమావేశాన్ని ప్రతిపాదించగా.. ఫిబ్రవరి 1న కొత్త రౌండ్ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అయినప్పటికీ, తక్షణ శాంతి అవకాశాలపై మార్కెట్లు పెద్దగా నమ్మకం చూపడం లేదు. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల్లోనూ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ వివాదంతో పాటు, వెనిజులాలో సైనిక జోక్యం సంబంధించిన వార్తలు, అలాగే గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే బెదిరింపుల వంటి అంశాలు ప్రపంచ రాజకీయ వాతావరణాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అంతా ప్రమాదకర ఆస్తుల నుంచి బయటకు వచ్చి.. బంగారం వంటి సాంప్రదాయ సేఫ్-హేవన్ ఆస్తుల వైపు మళ్లుతున్నారు. ఈ పెరిగిన డిమాండ్ బంగారం ధరలను రికార్డు స్థాయికి తీసుకెళ్లింది.
మరొక కీలక అంశం ఏంటంటే.. అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించినది. ప్రస్తుత ఫెడ్ చైర్మన్ తర్వాత ఎవరు బాధ్యతలు చేపడతారన్న దానిపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. తదుపరి ఫెడ్ చైర్మన్ ఎంపిక కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తిచేశారని వార్తలు వెలువడ్డాయి. ట్రంప్..తనకు అనుకూలంగా ఉండే చైర్మన్‌ను ఎంపిక చేస్తే, ఈ ఏడాది వడ్డీ రేట్ల కోతలు జరిగే అవకాశాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
వడ్డీ రేట్లు తగ్గితే gold ధరలకు అది అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే బంగారం లాభం ఇవ్వని ఆస్తి కావడంతో.. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని కలిగి ఉండే అవకాశ ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారంపై మరింత ఆసక్తి చూపుతారు. ఈ అంచనాలే ప్రస్తుతం బంగారం ధరలను మద్దతు ఇస్తూ, రికార్డు స్థాయిలకు తీసుకెళ్తున్న ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications