పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. పసిడి ధరలు ఏకంగా లక్ష మార్కును తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్, మెక్సికో నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని బెదిరించిన తర్వాత పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు పరుగులు పెట్టారు. జూలై 14, సోమవారం బంగారం ధర మూడు వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
అమెరికా ప్రపంచ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారుల నుంచి సురక్షిత పెట్టుబడికి డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లలొ అనిశ్చిత పరిస్థితులు, US డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న బలహీనత, వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా, రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 30% సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ ప్రకటన ప్రకారం, యూరోపియన్ యూనియన్, మెక్సికోతో జరిగిన వాణిజ్య చర్చలు విజయవంతం కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.దీనిపై EU, మెక్సికో స్పందించాయి. తమపై అమెరికా విధించిన సుంకాలు అన్యాయమని ఆరోపించాయి. అవి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకమని ఆరోపించాయి. అయినా కూడా EU ప్రభుత్వం ఆగస్టు ప్రారంభం వరకు ప్రతిస్పందనను వాయిదా వేస్తూ చర్చల ద్వారానే ఈ సమస్యపై పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపింది.
ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలతో మరోసారి ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ అనిశ్చితిలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు ఆసక్తి చూపిస్తున్నారు చూపుతున్నారు. అయితే.. ఈ ఉద్రిక్తతలు గడిచిన మూడు వారాలలో బంగారానికి తోడ్పాటుగా నిలిచినా.. భవిష్యత్తులో మార్కెట్ కదలికలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.
జూలై 14న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో లక్ష రూపాయలను తాకింది. నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 17 రూపాయిలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,988 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 15 రూపాయిలు పెరిగి 9,155 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 12 రూపాయిలు పెరిగి రూ.7,491 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1700 పెరిగి రూ. 9,97,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,500 పెరిగి రూ. 9,14,00 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 7, 47,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications