పండగ దెబ్బ..బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, ఫ్యూచర్స్ మార్కెట్‌లో ధరలు పైపైకి..

సోమవారం ఫ్యూచర్స్ మార్కెట్‌లో పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాములకు రూ.206 పెరిగి ధర రూ.98,025కి చేరుకుంది. బంగారం పెరుగుదల ప్రధానంగా స్పాట్ మార్కెట్‌లో బలమైన డిమాండ్, స్పెక్యులేటర్లు కొత్త పొజిషన్లు తీసుకోవడమే కారణమని నిపుణులు తెలిపారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు డెలివరీ బంగారం కాంట్రాక్టులు 5,831 లాట్‌ల వ్యాపార టర్నోవర్‌లో ట్రేడయ్యాయి. ధర రూ.206 లేదా 0.21 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.98,025 వద్ద స్థిరపడింది.

ధరల పెరుగుదల వెనుక కారణాలను మనం చూసుకున్నట్లయితే.. స్పాట్ మార్కెట్‌లో గట్టి కొనుగోలుపై పెట్టుబడిదారుల తాజాగా ఆసక్తి చూపారు. పండుగల సీజన్ ముందుగా ఉండడం వల్ల ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనుగోలు చేయడం చూడవచ్చు. అంతర్జాతీయంగా కూడా ఇదే ధోరణి కనిపించింది. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ఫ్యూచర్స్ ధర 0.14 శాతం పెరిగి 3,397.30 డాలర్లకు చేరుకుంది. బంగారం సురక్షిత పెట్టుబడిగా మారుతుండటంతో పెట్టుబడిదారులు భారీగా ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారులు వడ్డీ రేట్లు, రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల పర్యవేక్షణలో ఉన్నారు.

Gold futures gold price today spot gold demand gold MCX update bullion market gold price rise gold investment gold market trend precious metals festive gold demand gold price forecast MCX gold futures safe haven assets gold price India

ఫ్యూచర్స్ మార్కెట్ అంటే ఏమిటి : భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీలో ఒక వస్తువు లేదా ఆర్థిక సాధనాన్ని కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రదేశాన్ని ఫ్యూచర్స్ మార్కెట్ అంటారు. ఈ ఒప్పందాలను ఫ్యూచర్స్ కాంట్రాక్టులు అంటారు. ఫ్యూచర్స్ మార్కెట్‌లు, కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరికీ ధరల హెచ్చుతగ్గుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తాయి.

బంగారం ఫ్యూచర్స్ ధరలు అంటే ఏమిటి: భవిష్యత్తులో ఒక నిర్దిష్ట తేదీన బంగారాన్ని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి అంగీకరించిన ధరనే బంగారం ఫ్యూచర్స్ ధర అంటారు . ఇవి ఒక రకమైన కాంట్రాక్టులుగా చెప్పవచ్చు. వీటిలో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఒక నిర్దిష్ట ధర వద్ద ఒక నిర్దిష్ట పరిమాణంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి అంగీకరిస్తారు. ఈ ఫ్యూచర్స్ ధరలు మార్కెట్లో Gold డిమాండ్, సరఫరా ఆధారంగా నిర్ణయిస్తారు.

ఇక మీరు ఫ్యూచర్స్ కాంట్రాక్టును కొనుగోలు చేసిన తర్వాత.. Gold ధర పెరిగితే మీకు ఎంత పెరిగితే అంత లాభం వస్తుంది, అదే ధర తగ్గితే ఎంత తగ్గితే అంత నష్టం వస్తుంది. ఇదే సూత్రం అమ్మకందారులకు కూడా వర్తిస్తుంది. కాగా వ్యాపారులు, పెట్టుబడిదారులు ధరల హెచ్చుతగ్గుల నుండి తమను తాము రక్షించుకోవడానికి ఫ్యూచర్స్ మార్కెట్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇందులో పెట్టుబడి అనేది అధిక నష్టభయంతో కూడుకున్నది. దీనికి తగినంత అనుభవం, జ్ఞానం ఉండాలి. బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలపై పరిశోధన చాలా ఎక్కువగా చేయాలి.

డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+