Gold News: బంగారం ప్రవహించే నది గురించి తెలుసా..? మన దేశంలోనే ఉంది..
Gold News: పురాణకాలం నుంచి అనేక వింతలు, విశేషాలకు నిలయం భారతదేశం. ఇదే క్రమంలో సమాధానాలు లేని అనేక ప్రశ్నలు కలిగి ఉన్న రహస్యాల దేశం. దీనికి తోడు ఇక్కడి ప్రజలకు బంగారానికి విడతీయలేని అనుబంధం కూడా ఉంది.
అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది బంగారానికి సంబంధించిన రహస్య నది గురించే. అవును జార్ఖండ్ నుంచి ప్రవహిస్తున్న స్వర్ణరేఖ నదిలో నీటితో పాటు బంగారం కూడా ప్రవహిస్తుంది. ఇది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహిస్తోంది. రత్నగర్భ ప్రాంతంలో ప్రవహిస్తున్న ఇందులో స్వచ్ఛమైన బంగారం ఉందని మనలో చాలా మందికి తెలియదు.

గత కొన్నేళ్లుగా ఈ నదితో పాటు ఉపనది అయిన కర్కారిలో ప్రవహిస్తున్న ఇసుక నుంచి భారీ మెుత్తంలో బంగారం బయటపడుతోంది. 474 కిలో మీటర్లు పొడవున్న ఈ నది జార్ఖండ్ రాజధాని రాంచీకి దాదాపు 15 కి.మీ దూరంలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశం నుంచి ఉద్భవించింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిలిపోతుంది. ఇక్కడ నివసించే స్థానిక గిరిజన కార్మికులు ఇసుకను ఫిల్టర్ చేస్తూ, నది గర్భం నుంచి బంగారాన్ని బయటకు తీయడంలో నిమగ్నమై ఉన్నారు.
ఇదే తరహాలో బంగారం ప్రవహించే నది ఒకటి కెనడాలోనూ ఉంది. కెనడాలోని డాసన్ సిటీలో ప్రవహించే క్లోన్డికే నది నుంచి బంగారం కూడా కనుగొనబడింది. 1896లో జార్జ్ కార్మాక్, డాసన్ చార్లీ, జిమ్ మాసన్ ఈ నదిలో బంగారం దొరుకుతుందని మొదట వెల్లడించారు.


Click it and Unblock the Notifications