తగ్గిన బంగారం ధరలు, పెరిగిన వెండి ధర
బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. MCXలో ఉదయం గం.10 సమయానికి గత ముగింపు ధరతో పోలిస్తే రూ.115 తగ్గి 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.40,865 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. 0.30 శాతం లేదా రూ.138 పెరిగి కిలో రూ.46,365 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలర్ తగ్గి ఔన్స్ బంగారం ధర 1,585.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో బంగారం ఏప్రిల్ డెలివరీ 10 గ్రాములకు రూ.99 (0.24 శాతం) తగ్గి రూ.40,880 వద్ద ఉంది. జూన్ డెలివరీ ధర రూ.82 (0.20 శాతం) తగ్గి రూ.41,066 వద్ద ట్రేడ్ అయింది.

సోమవారం 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా.. చెన్నైలో రూ.39,150, రూ.42,640 వద్ద, ముంబైలో రూ.39,750, రూ.40,750, న్యూఢిల్లీలో రూ.39,950, రూ.41,150, కోల్‌కతాలో రూ.40,250, రూ.41,640, బెంగళూరులో రూ.38,350, రూ.41,800, హైదరాబాదులో రూ.39,150, రూ.42,640, విజయవాడలో రూ.39,150, రూ.42,640, విశాఖపట్నంలో రూ.39,150, రూ.42,640 వద్ద ఉంది.
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ వైరస్ ప్రభావం ఉంటోంది. చైనా జీడీపీ రేటు ఒక శాతం తగ్గవచ్చునని అంచనా. కరోనా వైరస్ ప్రభావం బంగారం, వెండి వంటి అతి విలువైన లోహాలపై ఉంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ లోహాలపై పెట్టుబడి పెడుతున్నారు.


Click it and Unblock the Notifications