బంగారం ప్రియులకు లడ్డులాంటి వార్త.. ఇప్పటి దాకా కొండెక్కిన బంగారం ధర రానున్న రోజుల్లో భారీగా తగ్గుముఖం పట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో మార్కెట్లో నెలకొన్న భయాలు, అమెరికా- చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరులో బంగారం ధరలు సామాన్యుడికి అందడం లేదు. అయితే రానున్న కాలంలో సామాన్యులకు ఊరటనిస్తూ బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నాయని సిటీబ్యాంక్ తెలిపింది.
సాధారణంగా అంతర్జాతీయంగా ఏదైనా సంఘటన జరిగినా.. రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొన్నా.. వాణిజ్య సంఘర్షణలు లేదా ఆర్థిక మాంద్యం వంటివి బంగారం ధరలను వెంటనే ప్రభావితం చేస్తున్నాయి.తాజాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుధ్ద వాతావరణంతో పాటు యునైటెడ్ స్టేట్స్లో నెలకొన్ని ఆర్థిక సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది.ఈ పెరుగుదల ప్రభావం భారతదేశ మార్కెట్ మీద కూడా పడింది.

అయితే ఈ పరిస్థితులకు ఊరటనిస్తూ సిటీ బ్యాంక్ ఓ అధ్యయానాన్ని వెలువరించింది. దీని ప్రకారం.. రాబోయే త్రైమాసికాల్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,000 డాలర్ల కంటే తక్కువగా, అంటే 25 శాతం వరకు తగ్గుతుందని పేర్కొంది. 2025 మూడవ త్రైమాసికంలో బంగారం ధర తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ కాలంలో ఒక ఔన్స్ బంగారం 3,100 డాలర్లు- 3,500 డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత కాలంలో ఇది మెల్లిగా 3 వేల డాలర్లకు చేరుకుుంటుందని సిటీ బ్యాంక్ అధ్యయనం తెలిపింది.
2026 ద్వితీయార్థంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర రూ. 2500 నుండి 2700 డాలర్లకి తగ్గే అవకాశం ఉందని ఈ పరిశోధన నివేదిక పేర్కొంది. పెట్టుబడిదారులలో ఆసక్తి తగ్గడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి, US బ్యాంక్ వడ్డీ రేటు సూచన కారణంగా బంగారం ధరలో మార్పును చూడవచ్చని పరిశోధన సిటీ బ్యాంక్ నివేదిక పేర్కొంది. కాగా గత ఒక్క సంవత్సరంలోనే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు 45 శాతం పెరిగింది.
2025 ప్రారంభం నుండి ఐదున్నర నెలల్లో ఇది 30 శాతం పెరిగింది. ఏప్రిల్ 22న, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3,500 డాలర్లకు చేరుకుంది. జూన్ 17 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3395 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర భారీగా పెరగడం వల్ల పెట్టుబడిదారులలో ఆసక్తి తగ్గుతుందని సిటీబ్యాంక్ నివేదిక పేర్కొంది.
ఇదిలా ఉంటే పసిడిపై సంచలన రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ బంగారంపై దిమ్మతిరిగే నివేదికను వెలుగులోకి తెచ్చింది. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల కేంద్ర బ్యాంకులు వరుసగా మూడవ సంవత్సరం 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి. 2025 సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్స్ (CBGR) సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. గత 10 ఏళ్లలో.. ప్రతి సంవత్సరం సగటున 400 నుండి 500 టన్నుల బంగారాన్ని కేంద్ర బ్యాంకులు కొనుగోలు చేయగా.. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications