మార్కెట్ రెగ్యులేటర్ సెబి... వాల్ట్ మేనేజర్లకు నిబంధనలను నోటిఫై చేసింది. తద్వారా ఎక్స్చేంజీలు దేశంలో పసిడి ఎక్స్చేంజీని ఏర్పాటు చేయడానికి అనుమతి లభించినట్లయింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో సెబి బోర్డు దీనిని క్లియర్ చేసింది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ల రూపంలో బంగారాన్ని ట్రేడ్ చేసేందుకు ఈ గోల్డ్ ఎక్స్చేంజీలు వీలు కల్పిస్తుంది. పసిడిని ప్రతిబింబించే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR)ను సెక్యూరిటీలుగా నోటిఫై చేస్తారు. ఇతర సెక్యూరిటస్ తరహాలో EGRలకు ట్రేడింగ్, క్లియరింగ్, సెటిల్మెంట్ సదుపాయాలు ఉంటాయి. EGRలు, గోల్డ్ ఫిజికల్ డెలివరీతో గోల్డ్ ఎక్స్చేంజీ ద్వారా దేశంలో భారీ పసిడి వ్యవస్థ ఏర్పడుతుందని అంచనా.

ముందుగా సెబికి నమోదు
EGRలను సృష్టించేందుకు పసిడిని జమ చేసుకునే వాల్ట్ సేవలను అందించేందుకు వాల్ట్ మేనేజర్లు సెబికి ఇంటర్మీడియరీగా నమోదు చేసుకోవాలి. గోల్డ్ డిపాజిట్లను అంగీకరించడం, నిల్వ చేయడం, భద్రంగా చేసుకోవడంతో పాటు EGRలను సృష్టించడం, ఉపసంహరించడం, ఫిర్యాదుల పరిష్కారం, ఎప్పటికప్పుడు డిపాజిటరీ రికార్డులతో ఫిజికల్ గోల్డును సమతౌల్యం చేసుకోవడం వంటివి వాల్ట్ మేనేజర్ల విధులు. వాల్ట్ మేనేజర్‌గా వ్యాపారాన్ని చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ అనుమతి కోసం సెబికి దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత ఇదే..
భారత్‌లో ఏర్పాటై కనీసం రూ.50 కోట్ల నికర సంపద కలిగిన కంపెనీ ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధనల్లో పేర్కొనని కార్యకలాపాలను వాల్ట్ మేనేజర్ నిర్వహిస్తే కనుక వాటిని విడిగా చేపట్టాలి. రికార్డ్స్, పత్రాలను కనీసం అయిదేళ్ల పాటు భద్రపరచాలి. సెబి నిర్దేశించే నిబంధనలను పాటించాలి. వాల్ట్ మేనేజర్ లేదా అతని తరఫు వ్యక్తి డిపాజిట్ అయ్యే పసిడి కేవలం గుర్తింపు ఉన్న రిఫైనరీ లేదా నామినేటెడ్ ఏజెన్సీ ద్వారా జరుగుతుందా లేదా అన్నదానిని ధృవీకరించుకోవాలి. గోల్డ్ ఎక్స్చేంజ్ ద్వారా స్పాట్ మార్కెట్లో పసిడి ధరలపై పూర్తి పారదర్శకత ఏర్పడుతుందని భావిస్తున్నారు.

తనిఖీ చేసే అధికారం
EGRల సృష్టి, ఉపసంహరణ విషయంలో ప్రతి వాల్ట్ మేనేజర్‌కు డిపాజిటర్‌తో ఒక కామన్ ఇంటర్ ఫేస్ ఉండాలి. డిపాజిటర్ నుండి గోల్డ్‌ను అంగీకరించిన తర్వాత వాల్ట్ మేనేజర్ సదరు డిపాజిటర్ పేరిట EGRను సృష్టించవలసి ఉంటుంది. వాల్ట్ మేనేజర్ అకౌంట్ బుక్స్, రికార్డ్స్, డాక్యుమెంట్స్, డిపాజిట్స్‌ను సెబి తనిఖీ చేయవచ్చు. ఇవి డిసెంబర్ 31 నుండి అమల్లోకి వచ్చాయి.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications