ETF, Mutual Funds: అత్యధిక రాబడి అందించిన ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్లు ఇవే..!
కొద్ది రోజులుగా ఈటీఎఫ్స్ అధిక రాబడులు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత స్టాక్ మార్కెట్లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 5 ఏళ్లలో మార్కెట్ సూచీల కంటే నిర్దిష్ట రంగాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన పీఎస్‌యూలు, బంగారం ఆధారిత ఈటీఎఫ్‌లు ఊహించని రీతిలో లాభాలను అందించాయి. దేశంలో అత్యధిక జనాదరణ పొందిన టాప్ ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్, వాటి 5, 3 సంవత్సరాల రాబడి ఎలా ఉందో పరిశీలిద్దాం..
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ బీఈఈఎస్ ఫండ్ గత 5 సంవత్సరాల వార్షిక సగటు రాబడి 30.7 శాతంగా ఉంది. ఇందులో లక్ష రూపాయలు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టినవారి వాల్యూ రూ.3.82 లక్షలకు పైగా పెరిగేది. సీపీఎస్‌ఈ ఈటీఎఫ్ గత 5 ఏళ్లలో వార్షిక సగటు రాబడి 30 శాతంగా ఉంది. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో దాని రూ.3.71 లక్షలకు పైగా చేరేది. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీఇఈఎస్ స్కీమ్ గత 5 సంవత్సరాల్లో వార్షిక సగటు రాబడి 26.20 శాతంగా ఉంది. ఇందులో లక్ష పెట్టుబడి పెట్టినవారికి డబ్బు ఇప్పుడు రూ.3.20 లక్షల వరకు పెరిగేది.

ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ భారత్ 22 ఈటీఎఫ్ ఐదేళ్లలో 23.60 శాతం వార్షిక రాబడి ఇచ్చింది. ఇందులో ఐదేళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే వారి వాల్యూ ఇఫ్పుడు రూ.2.89 చేరి ఉండేది.
నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ బీఎస్ఈ సెన్సెక్స్ నెక్ట్స్ 50 గత ఐదేళ్లలో 112.19 శాతం రాబడి ఇవ్వగా 16.20 శాతం సగటు వార్షిక రాబడి ఇచ్చింది. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ నెక్ట్స్ 50 జూనియర్ బీఇఈ గత ఐదేళ్లలో 92.12 శాతం రాబడి ఇవ్వగా.. 13.80 శాతం వార్షిక రాబడి ఇచ్చింది. ఇందులో రూ.లక్ష పెట్టుబడి పెడితే ఈ ఇప్పుడు అవి రూ.1.92 లక్షలకు పెరిగేది. నిప్పాన్ ఇండియా నిఫ్టీ ఫార్మా ఈటీఎఫ్ గత 5 ఐదేళ్లలో 13 శాతం సగటు వార్షిక రాబడి ఇచ్చింది. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ నిఫ్టీ బ్యాంక్ బీఇఈఎస్ ఐదేళ్లలో వార్షిక రాబడి 10.40 శాతంగా ఉంది. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ హ్యాంగ్ సెంగ్ బీఇఈఎస్ సగటు వార్షిక రాబడి 7.50 శాతంగా ఉంది.
మ్యూచువల్ ఫండ్లలో చూస్తే ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్ మూడేళ్లలో ఏకంగా 44.11 శాతం వార్షిక రాబడి అందించింది. రూ.10 వేల సిప్ ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా రూ. 6.59 లక్షలు అయ్యేది. యాక్సిస్ గోల్డ్ ఫండ్ 43.84 శాతం వార్షిష్ రాబడి ఇచ్చింది. యాక్సిస్ గోల్డ్ ఫండ్‌లో పెట్టిన వారికి రూ. 6.57 లక్షలు లభించే అవకాశం ఉంది. ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే గోల్డ్ ఫండ్లు దాదాపు రెట్టింపు రాబడిని అందించాయి. ఇందుకు ప్రధాన కారణం బంగారం ధరలు పెరగడమే. గోల్డ్ ఫండ్ల తర్వాత మూడో స్థానంలో నిలిచిన ఎస్‌బీఐ హెల్త్‌కేర్ అపార్చునిటీస్ ఫండ్ 21.36 శాతం రాబడి ఇచ్చింది. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 21.36 శాతం, హెచ్‌ఎస్‌బీసీ మిడ్‌క్యాప్ ఫండ్ 21.26 శాతం, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్ 21.17 శాతం రాబడులు అందించాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications