ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో, బంగారం పెట్టుబడులపై మళ్లీ ప్రజల ఆసక్తి పెరుగుతోంది. భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం కాదు, అది భద్రత, సంపద, స్థిరత్వానికి సంకేతం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో, ఇది సేఫ్ హేవన్ లేదా సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. అయితే భౌతిక బంగారం కొనుగోలు చేసి నిల్వ చేయడం అసౌకర్యంగా ఉండటం వల్ల, చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడు Gold ETFs, Gold Mutual Funds వైపు మళ్లుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏది మెరుగైన రాబడిని ఇస్తుందో, ఏది మీకు సరైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Gold ETF అంటే ఏమిటి? గోల్డ్ ETF లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది భౌతిక బంగారం ధరను ప్రతిబింబించే నిధి. ఇది నిష్క్రియాత్మకంగా (passively) నిర్వహించబడుతుంది, అంటే ఫండ్ మేనేజర్ తరచుగా మార్పులు చేయడు. ప్రతి ETF యూనిట్ 99.5% స్వచ్ఛమైన 1 గ్రాము బంగారం విలువను సూచిస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతుంది కాబట్టి దీని ధర రోజంతా బంగారం మార్కెట్ ధరతో పాటు మారుతుంది. పెట్టుబడి పెట్టడానికి డీమ్యాట్ ఖాతా అవసరం.ఇందులో దొంగతనం లేదా స్వచ్ఛత సమస్యల ముప్పు ఉండదు. ఇది సులభమైన లిక్విడిటీ, తక్షణ కొనుగోలు-అమ్మకాల సౌకర్యాన్ని అందిస్తుంది.

Gold Mutual Fund అంటే ఏమిటి?: గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు ETFలతో పోలిస్తే మొదటి సారి పెట్టుబడి పెట్టేవారికి అనుకూలం. ఇవి భౌతిక బంగారం, బంగారం ETFలు, బంగారం మైనింగ్ కంపెనీల షేర్లు వంటి బంగారం సంబంధిత ఆస్తుల్లో పెట్టుబడి పెడతాయి. ముఖ్యంగా, డీమ్యాట్ ఖాతా అవసరం లేకుండా SIP (Systematic Investment Plan) రూపంలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, ఇవి ETFలతో పోలిస్తే ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
వ్యయ నిర్మాణం, దాచిన ఛార్జీలు: గోల్డ్ ETFల వ్యయ నిష్పత్తి సాధారణంగా 0.4%-0.7% మధ్యలో ఉంటుంది. అయితే, దీనికి తోడు బ్రోకరేజ్, డీమ్యాట్ నిర్వహణ ఛార్జీలు వంటి ఖర్చులు ఉంటాయి. మరొక ముఖ్యమైన అంశం Tracking Error టే బంగారం ధరలో జరిగిన మార్పు ETF రాబడి మధ్య ఉన్న తేడా. ఇది కొంతమేర రాబడిపై ప్రభావం చూపుతుంది.
ఇక గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే.. వీటిలో వ్యయ నిష్పత్తి 0.8%-1.5% వరకు ఉండవచ్చు. ఇవి ఫండ్ నిర్వహణ ఫీజులు, నిష్క్రమణ ఛార్జీలు, పంపిణీదారుల కమిషన్లను కూడా కలిగి ఉంటాయి.
గత 10 సంవత్సరాల రాబడులు: గత దశాబ్దం లోపల గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు రెండూ సగటున 13-14% వార్షిక రాబడి ఇచ్చాయి. ఈ రాబడులు ప్రధానంగా ప్రపంచ బంగారం ధరలు, రూపాయి విలువ మార్పులు, ద్రవ్యోల్బణం, మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై ఆధారపడి ఉంటాయి. అయితే, ETFలు తక్కువ ఖర్చు నిష్పత్తి కారణంగా కొంచెం అధిక నికర రాబడిని చూపించాయి.
ఏది మంచి రాబడి ఇస్తుంది? గోల్డ్ ETFలు తక్కువ ఖర్చుతో, రియల్ టైమ్ ట్రేడింగ్ సౌకర్యంతో ఉండటం వల్ల మ్యూచువల్ ఫండ్స్ కంటే స్వల్పంగా ఎక్కువ రాబడిని ఇస్తాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌ల రాబడిని ETFల ఖర్చు నిష్పత్తి, ఫండ్ నిర్వహణ వ్యయాలు, SIP సమయాలపై ఆధారపడి ఉంటాయి. కనుక, తక్షణ లావాదేవీలకు ప్రాధాన్యతనిచ్చేవారికి ETFలు అనుకూలం, మొదటి సారి పెట్టుబడిదారులకు మ్యూచువల్ ఫండ్లు సౌకర్యవంతం.
పన్ను విధానం (Taxation): గోల్డ్ ETFలు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు రెండింటికీ ఒకే పన్ను నియమాలు వర్తిస్తాయి. మూడు సంవత్సరాల లోపు అమ్మితే Short-Term Capital Gains (STCG) పన్ను, మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే Long-Term Capital Gains (LTCG) పన్ను 20 శాతం (indexation ప్రయోజనంతో) వర్తిస్తుంది. ఏదేమైనా మీరు పెట్టుబడులను స్వయంగా నిర్వహించగలరని అనుకుంటే గోల్డ్ ETFలు ఉత్తమం. సులభతరమైన, క్రమమైన పెట్టుబడిని కోరుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు సరైన ఎంపిక. రెండు కూడా భౌతిక బంగారానికి సురక్షితమైన, పారదర్శకమైన ప్రత్యామ్నాయాలు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications