గత కొన్నాళ్లుగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం కమోడిటీ మార్కెట్‌పైనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ల పై కూడా గట్టిగా పడింది. కొన్ని ఫండ్స్ ఏకంగా 20 శాతం వరకు నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఏమైంది ఈ మార్కెట్‌కు?
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన ధరలు ఇప్పుడు పాతాళానికి ఎందుకు పడిపోతున్నాయి? దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు మారుతుండటంతో డాలర్ విలువ పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం ధరలు తగ్గుతాయి. దీనికి తోడు, ధరలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున 'ప్రాఫిట్ బుకింగ్' (లాభాల స్వీకరణ) చేయడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
కకావికలమైన Gold ETF , Silver ETFలు
ఈ ధరల పతనం వల్ల జీరోధా గోల్డ్ ఈటీఎఫ్, నిప్పాన్ ఇండియా, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ గోల్డ్ ఈటీఎఫ్ లు దాదాపు 9 శాతం వరకు నష్టపోయాయి. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్, ఎడెల్విస్ వంటివి ఏకంగా 20 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్ స్వల్పంగా కోలుకుని.. సుమారు 10 శాతం రికవరీ సాధించడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశం.
ధరల పతనం గణాంకాలు ఇలా ఉన్నాయి (MCX)..
మార్కెట్ ఒడిదుడుకులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ కింది లెక్కలు చూస్తే అర్థమవుతుంది..
• వెండి: కేవలం రెండు రోజుల్లోనే కేజీ వెండిపై రూ. 1.35 లక్షల మేర ధర తగ్గింది. జనవరి 30న వెండి ఏకంగా 27% పడిపోయి చరిత్రలోనే అత్యంత దారుణమైన పతనాన్ని చూసింది.
• బంగారం: అదే సమయంలో బంగారం ధర కూడా రూ. 31,000 వరకు తగ్గింది. ఏప్రిల్ ఫ్యూచర్స్ ధర రూ. 1,47,400 వద్ద ట్రేడ్ అవుతోంది.
BSE కీలక నిర్ణయం - సర్క్యూట్ లిమిట్స్
బంగారం, వెండి ధరల్లో ఇంతటి భారీ హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను ముంచేయకుండా ఉండేందుకు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (BSE) రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 1 నుంచి గోల్డ్ , సిల్వర్ ఈటీఎఫ్‌లపై 20% సర్క్యూట్ పరిమితిని విధించింది. అంటే ధరలు ఒకే రోజులో 20 శాతం కంటే ఎక్కువ పెరగడానికి లేదా తగ్గడానికి వీలుండదు. ఇది ఇన్వెస్టర్ల సొమ్మును రక్షించడానికి తీసుకున్న నిర్ణయం.
ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
ధరలు తగ్గుతున్నాయి కదా అని కంగారుపడి ఉన్న స్టాక్ ను తక్కువ ధరకే అమ్మేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ ఇండ్ సెక్యూరిటీస్ విశ్లేషకుల ప్రకారం.. చైనా మార్కెట్లో స్పెక్యులేటర్లు లాభాలు తీసుకోవడం వల్ల ఈ పతనం సంభవించింది.
- దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు: మీరు కనీసం 3 నుంచి 5 ఏళ్ల కోసం ఇన్వెస్ట్ చేస్తుంటే, ఇలాంటి స్వల్పకాలిక పతనాలను చూసి భయపడాల్సిన అవసరం లేదు.
- కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారు: ధరలు తగ్గినప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లో సిప్ (SIP) పద్ధతిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి అవకాశం కావచ్చు.
అయితే వెండి ధరలు ఇంకా రూ. 2,45,000 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గుడ్డిగా పెట్టుబడి పెట్టకుండా ఆచితూచి అడుగు వేయడం ఉత్తమం.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications