ఈ వారం ఆసియాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం... బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ లో చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందువల్ల, సాధారణ వ్యక్తులు, ఆభరణాల వ్యాపారులు కూడా Gold కొనడం తగ్గించారు. పొరుగుదేశం చైనాలో ఇప్పుడు బంగారం డిస్కౌంట్లు భారీగా పెరిగాయి. అంటే, డీలర్లు గ్లోబల్ మార్కెట్ ధరతో పోల్చితే ఒక్క ఔన్సు బంగారానికి 17 డాలర్ల నుంచి 24 డాలర్ల వరకు తక్కువ ధరను ప్రకటిస్తున్నారు. ఇది గతంలో గడచిన నెలల కంటే అత్యధిక డిస్కౌంట్లుగా చెప్పవచ్చు.స్వతంత్ర గోల్డ్ నిపుణులు చెబుతున్నట్టుగా భారీ ధరలు దేశీయ మార్కెట్ డిమాండ్‌ను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా ఆభరణాల కొనుగోలు అనేది చాలా తక్కువ స్థాయిలో జరుగుతోంది.
షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్‌లో ప్రస్తుతం భౌతిక బంగారం నిల్వలు పెరిగి 50 మెట్రిక్ టన్నులకి చేరాయి. అంటే చైనా మార్కెట్ లో ఎక్కువ బంగారం నిల్వ చేయబడుతోంది. ఇక షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ వాల్యూమ్ నాలుగు నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. కొంతమంది డీలర్లు ఇప్పటికీ 6 డాలర్ల తగ్గింపు 2 డాలర్ల ప్రీమియం తో (అమెరికా రేటుతో) బంగారం విక్రయిస్తున్నారు. ఇందులో 6 శాతం దిగుమతి రుసుము.. 3 శాతం అమ్మకపు సుంకాలు కూడా ఉంటాయి.

ఇక భారతదేశ పరిస్థితిని చూస్తే... ఈ వారం బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 109,840 నుండి రూ. 1,11,000 కు పైగా పెరిగాయి. రిటైల్ కొనుగోలుదారులు, ధరలు అధికంగా ఉండటంతో, ఇప్పుడు ముందుకు రావడం మెల్లగా చేస్తున్నారు. అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. భారతీయులందరూ పండుగ సీజన్ లో బంగారం కొనడాన్ని శుభంగా భావిస్తారు. కానీ ప్రస్తుతం ధరలు పెరిగిన కారణంగా, ఆభరణ వ్యాపారులు కూడా ఎంతగా డిమాండ్ పెరుగుతుందో తెలియదు అని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో ఒక్క ఔన్సు బంగారం 1.60 డాలర్ల ప్రీమియంతో అమ్మబడుతోంది. సింగపూర్‌లో 2.20 డాలర్ల వరకు ప్రీమియం ఉన్నది.
గోల్డ్ సిల్వర్ సెంట్రల్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ లాన్ చెబుతున్న వివరాల ప్రకారం.. ఇప్పటి పరిస్థితుల్లో ఆభరణాల డిమాండ్ తగ్గుతుండగా, పెట్టుబడిగా బంగారం బార్‌లు కొనుగోలు చేయడం పెరుగుతుందని చెప్పారు. ఇది భవిష్యత్తులో బంగారం డిమాండ్‌ను మరింత బలంగా పెంచే అవకాశం ఉందన్నారు. జపాన్‌లో కూడా బంగారం ధర 0.50 డాలర్ తగ్గించి, 1 డాలర్ ప్రీమియంతో ట్రేడైంది.
క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయికి పెరిగినప్పటికీ.. కొంతమంది కొనుగోలుదారులు ధరలు తగ్గే వరకు వేచి చూస్తున్నారు. పండుగ సీజన్ ముందు మార్కెట్ ఎలా మారుతుందో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అధిక ధరల కారణంగా కొందరు బంగారం కొనడాన్ని వాయిదా వేసుకున్న పరిస్థితి నెలకొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!



Click it and Unblock the Notifications