కరోనా థర్డ్ వేవ్, ఆ తర్వాత రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ నెలలోనే కాస్త తగ్గుముఖం పట్టాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలో జనవరి నుండి మార్చి మధ్య కాలంలో పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం సమీపానికి చేరడంతో పసిడి డిమాండ్ తగ్గింది. ప్రస్తుత క్యాలెండర్ ఏడాది తొలి మూడు నెలల్లో మన దేశంలో పసిడి డిమాండ్ 18 శాతం క్షీణించి 135.5 టన్నులకు తగ్గింది. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 165.8 టన్నులుగా నమోదయింది. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గురువారం తెలిపింది.
వ్యాల్యూ పరంగా బంగారం డిమాండ్ 12 శాతం తగ్గింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో రూ.61,550 కోట్ల బంగారం విక్రయించగా, 2021 అదే సమయంలో రూ.69,720 కోట్ల పసిడిని విక్రయించారు. ఆభరణాలకు 26 శాతం డిమాండ్ తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. అయితే గత త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడులు మాత్రం 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 5 శాతం పెరగడం గమనార్హం.

ధరల పెరుగుదలతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, రూపాయి క్షీణత కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిలో పెట్టుబడులకు మొగ్గు చూపారు చాలామంది. మొదటి త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్ 100 టన్నుల కంటే తక్కువగా ఉండటం 2010 తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. జనవరి - మార్చి మధ్య మంచి రోజులు తక్కువగా ఉండటంతో శుభకార్యాలు తగ్గాయి. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరిగాయి.
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications