Gold News: బంగారం చూసి పారిపోతున్న ప్రజలు.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్..
Gold News: బంగారానికి దేశంలో ఫ్యాన్స్ లక్షల్లో కాదు కోట్లలో ఉన్నారు. అయినా ఇప్పుడు వారందరూ గోల్డ్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తాజా నివేదికలో దీనికి సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు చతికిలపడ్డాయి. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద వినియోగదారు అయిన భారత్‌లో బంగారం డిమాండ్ 7 శాతం తగ్గి 158.1 టన్నులకు చేరుకుంది. అయితే 2023 క్యూ2లో బంగారం దిగుమతులు 16 శాతం పెరిగి 209 టన్నులకు చేరుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

2023 మెుదటి ఆరు నెలల కాలంలో బంగారం డిమాండ్ 271 టన్నులుగా.. ఏడాది మెుత్తానికి 650-750 టన్నులుగా డిమాండ్ ఉంటుందని అంచనా వేయబడింది. అయితే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ మంది పసిడిని కొనేందుకు మెుగ్గు చూపటం లేదు. దీంతో అమ్మకాలు రికార్డు స్థాయిలో తగ్గి.. వినియోగదారుల స్థోమత, సెంటిమెంట్‌ను భారీగా ప్రభావితం చేసిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజినల్ CEO సోమసుందరం తెలిపారు.
అత్యంత తక్కువ కాలంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగి 10 గ్రాములకు గరిష్ఠంగా రూ.64,000కు చేరుకున్నాయి. రెండవ త్రైమాసికంలో ఇండియాలో విక్రయించబడిన బంగారం విలువ చూసినట్లయితే రూ.82,530 కోట్లుగా ఉంది. ఇది గడచిన ఏడాది కంటే నాలుగు శాతం అధికం. అలాగే ఆభరణాల రూపంలో రెండవ త్రైమాసికంలో 140.3 టన్నుల బంగారం విక్రయించబడింది. ప్రధానంగా 18 క్యారెట్ల బంగారు ఆభరణాలకు డిమాండ్ కనిపించినట్లు నివేదిక పేర్కొంది. ఇదే క్రమంలో బంగారం రీసైక్లింగ్ ఈ త్రైమాసికంలో బాగా పెరిగి 37.6 టన్నులకు చేరుకుంది.


Click it and Unblock the Notifications