Gold coins Nishka: భారతదేశంలో బంగారు నాణేల చరిత్ర అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది కుషాణుల పాలన (1వ-3వ శతాబ్దం CE). బంగారు నాణేలు భారతదేశంలో కుషాణుల కాలంలోనే వాడుకలోకి వచ్చాయని చరిత్ర కూడా చెబుతోంది. అయితే ఈ వాదన ఇప్పుడు కరెక్ట్ కాదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త బి.ఆర్. మణి ( 2003లో అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన రామజన్మభూమి తవ్వకాలకు నాయకత్వం వహించిన వ్యక్తి) తాజాగా చేసిన అధ్యయనం కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చాయి. దీని ప్రకారం భారతీయులు కుషాణుల కాలానికి దాదాపు 3 వేల సంవత్సరాల ముందే బంగారు నాణేలను ఉపయోగించారు.
నిష్కా అంటే ఏమిటి? మణి వివరణ ప్రకారం నిష్కా అనేవి వృత్తాకార, డిస్క్ ఆకారంలో ఉండే బంగారు నాణేలు. వీటిలో చిన్న రంధ్రాలు ఉండేవి. చాలాకాలం పాటు వీటిని కేవలం అలంకార పూసలుగా భావించేవారు. అయితే మణి చేసిన పరిశోధన ఏం చెబుతోందంటే.. ఇవి కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. నిష్కాలు కరెన్సీ, వాణిజ్య ఆస్తులు, ఆచార సమర్పణలు, సామాజిక స్థితి చిహ్నాలుగా ఉపయోగించారని తెలుస్తోంది. ఆ కాలంలో డబ్బును 100 నిష్కా లేదా 1,000 నిష్కాలుగా లెక్కించేవారని మణి స్పష్టం చేశారు. అంటే ఇవి మనకు తెలిసిన బంగారు నాణేల మొదటి రూపంగా చెప్పుకోవచ్చు.

హరప్పా నాగరికత ప్రదేశాలైన మొహెంజొదారో (సింధ్, పాకిస్తాన్), లోథాల్ (గుజరాత్), రాఖీగర్హి (హర్యానా) వంటి చోట్ల త్రవ్వకాలలో ఇలాంటి బంగారు చిల్లులు బయటపడ్డాయి. 1950లు-60లలో లోథాల్‌ను తవ్విన ఎస్.ఆర్. రావు వీటిని మైక్రో బీడ్స అని పిలిచారు. మండి (పశ్చిమ ఉత్తరప్రదేశ్) లో లభించిన ఒక పెద్ద నిల్వలో ఉన్న 40 బంగారు నాణేలను అధ్యయనం చేసిన మణి, వీటిని కేవలం పూసలుగా చూడకూడదని నిర్ధారించారు. వాటి బరువులు, ఆకారం, వినియోగ విధానం పరంగా చూస్తే.. ఇవి నిజంగా నాణేలు అనే విషయాన్ని బయటపెట్టాయి.
నిష్కా ప్రస్తావన కేవలం పురావస్తు ఆధారాల్లోనే కాకుండా వేద గ్రంథాలు, సంస్కృత సాహిత్యంలో కూడా ఉంది. మణి తెలిపిన వివరాల ప్రకారం..ఋగ్వేదం, అథర్వణ వేదం,పాణిని రచనలు, పతంజలి మహాభాష్యం,జాతక కథలు, శతపథ బ్రాహ్మణం, గోపథ బ్రాహ్మణం వంటి పురాణాలన్నీ నిష్కా గురించి ప్రస్తావిస్తున్నాయి. వీటి ప్రకారం.. నిష్కాలు కేవలం అలంకార పూసలు కాదు. ఆ కాలంలో లావాదేవీలు, ఆర్థిక లెక్కలు, యజ్ఞాలు, సామాజిక ప్రతిష్ఠలో కీలక పాత్ర పోషించాయి.
ఈ ఆవిష్కరణతో మనకు రెండు ప్రధానమైన విషయాలు స్పష్టమవుతున్నాయి..భారతదేశపు బంగారు నాణేల చరిత్ర కుషాణుల కాలంతో మొదలవదు. అది హరప్పా-వేద యుగాలకు వెనక్కి వెళ్లుతుంది. హరప్పన్లు, వేద ప్రజలు కేవలం వ్యవసాయ సమాజం కాదు. వారు అధునాతన లోహశాస్త్ర జ్ఞానం, వాణిజ్య నెట్‌వర్క్‌లు కలిగిన ఆర్థికంగా అభివృద్ధి చెందిన నాగరికతకు చిహ్నంగా నిలిచారు.పద్మభూషణ్ అవార్డు గ్రహీత పురావస్తు శాస్త్రవేత్త కైలాష్ నాథ్ దీక్షిత్ బి.ఆర్. మణి పరిశోధనలపై మాట్లాడుతూ.. ఈ పరిశోధనలు రాబోయే తరాలకూ జ్ఞానోదయాన్ని కలిగిస్తాయని తెలిపారు. ఈ ఆవిష్కరణ భారతదేశ చరిత్రను చూసే కోణాన్ని పూర్తిగా మార్చేస్తుందని నేషనల్ మ్యూజియం పరిరక్షణ డైరెక్టర్ శిల్పా రాటూరి కూడా మాట కలిపారు.
భారతదేశపు తొలి బంగారు నాణేలు నిష్కా అని బి.ఆర్. మణి నిరూపించడంతో.. మనం చరిత్రలో ఇప్పటివరకు నమ్మిన వాస్తవాలు తారుమారు అవుతున్నాయి. హరప్పా-వేద ప్రజలు కేవలం నాగరిక సమాజమే కాదు. సాంకేతికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాణిజ్య శక్తి అని ఇది చూపిస్తోంది. కుషాణులకు ముందు వేల సంవత్సరాల క్రితమే భారతీయులు బంగారాన్ని కరెన్సీగా ఉపయోగించారనేది ఈ పరిశోధన చెబుతున్న అసలు సత్యం మరి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications