బంగారాన్ని మన దేశంలో కేవలం ఒక విలువైన లోహంగా మాత్రమే చూడటం లేవు. అది ఒక సంస్కృతి, సంప్రదాయం, ఆర్థిక బలం అన్నీ కలబోతగా చూస్తున్నారు. ప్రపంచదేశాల నుంచి ప్రతి సంవత్సరం భారతదేశానికి లక్షల కిలోల బంగారం దిగుమతి అవుతుంటుంది. పెళ్లిళ్లు, పండుగలు, ఆభరణాల తయారీ నుండి శస్త్రచికిత్సల పరికరాలు, కనెక్టర్లు, మైక్రోచిప్‌ల వరకు బంగారం అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఈ పసిడి లోహం దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో మీకు తెలుసా? దీనికి సమాధానం ముంబైలోని జవేరీ బజార్.దేశంలోని అతిపెద్ద బంగారు మార్కెట్ గా ఇది తన పేరును నిలుపుకుంది.
ముంబై ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది. అయితే బంగారం విషయానికి వస్తే.. జవేరీ బజార్.. భారతదేశంలోనే కాదు, ఆసియాలో కూడా అతిపెద్ద బంగారు మార్కెట్‌గా గుర్తింపు పొందింది. ఈ మార్కెట్‌కు దాదాపు 160 ఏళ్ల చరిత్ర ఉంది. 1864లో ప్రసిద్ధ బులియన్ వ్యాపారి త్రిభోవాందాస్ జవేరి దీన్ని స్థాపించారు. ఆయన పేరు మీదే ఈ బజార్‌కు జవేరీ బజార్ అని పేరు వచ్చింది.
ఇక్కడి నుంచి దేశంలో దాదాపు ప్రతి మూలకు బంగారు ఆభరణాలు ఎగుమతి అవుతాయి. ఇక్కడ లభించే ఆభరణాల వైవిధ్యం, నాణ్యత సాటిలేనివి. కేవలం బంగారం మాత్రమే కాకుండా వజ్రాలు కూడా ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు జరుగుతాయి. ముఖ్యంగా హోల్‌సేల్ మార్కెట్‌గా జవేరీ బజార్ చాలా ప్రసిద్ధి చెందింది. అంటే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే ఇక్కడ ధర తక్కువగా ఉంటుంది. అయితే రిటైల్ ధరలు మాత్రం మార్కెట్ డిమాండ్ ఆధారంగానే ఉంటాయి.

జవేరీ బజార్ అతిపెద్ద మార్కెట్ అయినా.. కేరళలోని త్రిసూర్ నగరాన్ని భారతదేశ బంగారు రాజధానిగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరంలో అనేక Gold ఆభరణాల తయారీ కేంద్రాలు, కర్మాగారాలు, చేతి వృత్తులవారు ఉన్నారు. త్రిసూర్‌లో ఉత్పత్తి అయ్యే ఆభరణాలు కేవలం కేరళ మాత్రమే కాకుండా.. దక్షిణ భారతదేశం మొత్తానికి వెళుతుంటాయి. ఇక్కడ తయారయ్యే డిజైన్లు, నాణ్యత ప్రత్యేకంగా పేరుపొందాయని చెప్పవచ్చు.
త్రిసూర్ ఆభరణాల పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చే ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. అనేక కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. బంగారం వ్యాపారం, తయారీ కేంద్రాల సంఖ్య పరంగా చూసినా, త్రిసూర్‌కు వచ్చిన ఖ్యాతి వేరే ఏ నగరానికీ రాలేదు. అందుకే దాన్ని గోల్డ్ కాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. జవేరీ బజార్, త్రిసూర్‌తో పాటు మహారాష్ట్రలోని జల్గావ్, మధ్యప్రదేశ్‌లోని రత్లాం, ఢిల్లీలోని సరఫా బజార్ ఇవన్నీ బంగారు వ్యాపారానికి ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ పరిమాణం, చరిత్ర, ఉత్పత్తి సామర్థ్యం విషయానికి వస్తే జవేరీ బజార్, త్రిసూర్ ముందంజలో ఉంటాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications