పైసా డబుల్ చేసిన పసిడి.. 105 శాతం రాబడితో దుమ్ముదులిపిన గోల్డ్ బాండ్స్.. పూర్తి వివరాలు
Gold Bonds: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SGB 2017-18 సిరీస్ IIIలో పెట్టుబడి పెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ పెట్టుబడిదారుల అకాల ఉపసంహరణ ధరను నిర్ణయించింది. ఈ బాండ్ మెచ్యూరిటీ వ్యవధి ఎనిమిదేళ్లు. అయితే గడువు సమయానికి ముందుగా ఉపసంహరించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న బంగారం ధరలు గోడ్ల్ బాండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలను తెచ్చి పెట్టాయి.
గోల్డ్ బాండ్ స్కీమ్ కింద అకాల ఉపసంహరణకు జారీ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల తర్వాత అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో గోల్డ్ బాండ్ 2017-18 స్కీమ్ సిరీస్ III ఇష్యూ ధర రూ.2,964గా ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన బంగారం ధరల కారణంగా 104 శాతం రాబడితో ఇది రూ.6,063కి చేరుకుంది. అక్టోబర్ 16, 2017న జారీ చేసిన ఈ బాండ్లను ఇన్వెస్టర్లు ముందుగా ఉపసంహరించుకున్నట్లయితే పైన చెప్పిన రాబడిని పొందవచ్చు.

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ దేశీయ మార్కెట్లలో రికార్డు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు అక్షయ తృతీయ సమీపిస్తున్న వేళ గోల్డ్ ధరలు ఊపందుకున్నాయి. బంగారం ఈ ఏడాది బలమైన రాబడులను అందించింది. మార్కెట్లోని పెట్టుబడి సాధనాలైన ఈక్విటీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కంటే అధికంగా రాబడులను అందించింది. ప్రస్తుతం బ్యాంకింగ్ సంక్షోభం, మాంద్యం భయాలు వంటి కారణాలతో సురక్షితమైన పెట్టుబడిగా పేరుగాంచిన బంగారంలోకి చాలా మంది తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. దీంతో 2023లో బంగారం ధరలు దాదాపు 9 శాతం మేర పెరిగాయి.
గోల్డ్ బాండ్ అంటే ఏమిటి : బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ బాండ్లపై అందించే వడ్డీ రేటు పెట్టుబడిదారులు బాండ్లను కొనుగోలు చేయడానికి చెల్లించే ప్రారంభ పెట్టుబడి మొత్తంపై సంవత్సరానికి 2.50 శాతంగా ఉంటుంది. వడ్డీ మొత్తాన్ని ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుల ఖాతాకు జమ చేయటం జరుగుతుంది.


Click it and Unblock the Notifications