2025లో బంగారం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ వేగంగా పెరిగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 4,123 డాలర్లు కాగా, భారతదేశంలో ధర రూ. 1,26,090 వద్ద ఉంది. సంవత్సరం ప్రారంభంలో ఈ ధరలు వరుసగా 2,600 డాలర్లు మన కరెన్సీలో రూ.80 వేల కంటే కొంచెం తక్కువగా ఉండటం చూస్తే.. బంగారం ఒకే ఏడాదిలో చూపించిన పెరుగుదల ఎంత భారీగా ఉందో తెలుస్తుంది. ఈ పెరుగుదల కారణంగా చాలామంది ఈక్విటీల కంటే Gold పెట్టుబడికి మంచిదా?" అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నను నేరుగా పోలికగా అడగడం అంత మంచిది కాదు. ముందుగా పెట్టుబడిదారులు ఈ రెండు ఆస్తులను ఎందుకు పోలుస్తున్నారో అర్థం చేసుకోవాలి.
సెన్సెక్స్‌ను మనం రూపాయిలలో కొలుస్తాం. బంగారం ధరను ప్రపంచవ్యాప్తంగా డాలర్లలో నిర్ణయిస్తారు. చరిత్ర చూస్తే రూపాయి డాలర్‌తో పోలిస్తే ప్రతి సంవత్సరం సుమారు మూడు శాతం విలువ కోల్పోతోంది. అందువల్ల సెన్సెక్స్‌ను INRలో, బంగారాన్ని USDలో పోల్చడం కొంతవరకు సరైనదే. ఈ నేపథ్యంతో రాబడులను పరిశీలిస్తే బంగారం గత మూడు సంవత్సరాలుగా అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. 2025లో ఇప్పటివరకు Gold రాబడి 58 శాతం దాటింది. ఇదే సమయంలో సెన్సెక్స్ ఎనిమిది శాతం, నిఫ్టీ తొమ్మిది, సగం శాతం మాత్రమే ఇచ్చాయి. ఇది ఒక్కసారిగా వచ్చిన పెరుగుదల కాదు. 2024లో బంగారం 27 శాతం, 2023లో 13 శాతం పెరిగింది. అంటే వరుసగా మూడు సంవత్సరాలు బంగారం బలమైన ర్యాలీలో ఉంది.

తక్కువ కాలపరిమితుల్లో చూసినా బంగారం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. గత ఒక సంవత్సరంలో బంగారం 61 శాతం రాబడి ఇచ్చినప్పుడు సెన్సెక్స్ 9 శాతం మాత్రమే ఇచ్చింది. మూడు సంవత్సరాల పరిధిలో బంగారం 32 శాతం, సెన్సెక్స్ 11 శాతం; నాలుగు సంవత్సరాల్లో బంగారం 23 శాతం, సెన్సెక్స్ 9 శాతం; ఐదు సంవత్సరాల్లో బంగారం 16 శాతం, సెన్సెక్స్ 14 శాతం ఇచ్చాయి. ఈ మొత్తం మధ్యకాలంలో బంగారం పెట్టుబడిగా ఎంత బలంగా నిలిచిందో సూచిస్తుంది.
హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు తెలుసుకోండి
అయితే దీర్ఘకాలానికి వెళితే చిత్రం పూర్తిగా మారిపోతుంది. గత పది సంవత్సరాల్లో బంగారం, సెన్సెక్స్ రెండూ 12.7 శాతం చొప్పున సమాన రాబడి ఇచ్చాయి. పద్దెనిమిదేళ్ళ గడువు తీసుకుంటే బంగారం రాబడి 7.7 శాతం మాత్రమే ఉండగా సెన్సెక్స్ 10 శాతం ఇచ్చింది. ఇరవై సంవత్సరాలకు బంగారం 11 శాతం, సెన్సెక్స్ 12 శాతం; ఇరవై ఐదు సంవత్సరాలకు బంగారం 11.5 శాతం, సెన్సెక్స్ 13 శాతం రాబడి ఇచ్చాయి. అంటే లాంగ్ టర్మ్‌లో ఈక్విటీలు బంగారాన్ని స్పష్టంగా మించిపోతాయి.
బంగారానికి ఒక పెద్ద సమస్య కూడా ఉంది. అది ఎల్లప్పుడూ పెరగదు; చాలా పొడవైన కాలం పాటు స్తబ్దతలో ఉండే స్వభావం ఉంది. ఉదాహరణకు 1980లో బంగారం ధర 600 డాలర్లకు చేరింది. ఆ తర్వాత దాదాపు ఇరవయ్యైదు సంవత్సరాలు ఆ స్థాయి దాటి పెరుగలేదు. 2006లో మాత్రమే అది మళ్లీ 600 డాలర్లకు చేరింది. అంటే బంగారం పావు శతాబ్దం కాలం పెట్టుబడిదారులకు నూలు శాతం రాబడి ఇచ్చిన సందర్భం ఇది.
బంగారం అనిశ్చిత పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు వంటి కారణాల వల్ల బంగారం ఇటీవలి కాలంలో బలంగా పెరిగింది. తక్కువ, మధ్యకాలంలో బంగారం ఈక్విటీలను మించగలదు. కానీ దశాబ్దాలపాటు పెట్టుబడులను చూస్తే ఈక్విటీ మార్కెట్లు సంపదను మరింత వేగంగా సృష్టిస్తాయి.అందువల్ల పెట్టుబడిదారులకు ఉత్తమ వ్యూహం ఏదంటే తమ పోర్ట్‌ఫోలియోలో 10 నుంచి 15 శాతం వరకు బంగారానికి కేటాయించడం సరైనదిగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. భౌతిక బంగారం కన్నా తక్కువ ఖర్చుతో, పారదర్శకంగా, సురక్షితంగా ఉండే గోల్డ్ ETFs వంటి మార్గాల ద్వారా బంగారం ఎక్స్‌పోజర్‌ను కలిగి ఉండటం ఇప్పుడు అత్యంత సమర్థవంతమైన ఎంపికగా భావించబడుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!



Click it and Unblock the Notifications