బంగారాన్ని పెట్టుబడిగా చూడటం అందరూ చేసే అది పెద్ద పొరపాటు.. సామాన్యులకు కీలక సూచన చేసిన రే డాలియో..
అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి తగ్గిన తరువాత బంగారం ధరలు పుంజుకోవడంతో.. ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో మరోసారి బంగారం మీద పలు కీలక సూచనలు చేశారు. డబ్బును నిల్వ చేసుకోవడానికి బంగారం అత్యుత్తమ ప్రదేశమని ఆయన తెలిపారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ సందర్భంగా CNBCతో మాట్లాడుతూ.. బంగారం ప్రధాన బలమేమిటంటే అది రోజురోజుకూ మారిపోని విలువ కలిగి ఉండటమేనని డాలియో పేర్కొన్నారు.
బంగారం ధరలు ఇటీవలి కాలంలో చారిత్రాత్మక స్థాయిలో అమ్మకాలను ఎదుర్కొన్న నేపథ్యంలో డాలియో వ్యాఖ్యలు రావడం గమనార్హం. గత వారం గరిష్ట స్థాయిల నుంచి ధరలు తగ్గినప్పటికీ, దీన్ని చూసి పెట్టుబడిదారులు గందరగోళానికి లోనవ్వకూడదని ఆయన సూచించారు. గత ఏడాది కాలంలో Gold ధరలు దాదాపు 65 శాతం పెరిగాయి. అయితే గరిష్ట స్థాయిల నుంచి సుమారు 16 శాతం తగ్గాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు 'ఇది ఇంకా పెరుగుతుందా? తగ్గుతుందా? ఇప్పుడే కొనాలా?' అనే ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఇదే వారు చేసే ప్రధాన పొరపాటు" అని రే డాలియో వ్యాఖ్యానించారు.

బంగారాన్ని ఒక ట్రేడింగ్ సాధనంగా కాకుండా.. పోర్ట్‌ఫోలియోలో భాగంగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు, సావరిన్ వెల్త్ ఫండ్‌లు Gold కొనాలా వద్దా అనే ప్రశ్నకు బదులుగా.. తమ మొత్తం పెట్టుబడుల్లో ఎంత శాతం బంగారానికి కేటాయించాలో నిర్ణయించుకోవాలని సూచించారు. ఒక నిర్దిష్ట శాతాన్ని స్థిరంగా ఉంచుకోవడం ద్వారా, పోర్ట్‌ఫోలియోలోని ఇతర బలహీనమైన ఆస్తుల నుంచి వచ్చే ప్రమాదాన్ని బంగారం సమర్థంగా తగ్గిస్తుందని ఆయన అన్నారు.
బంగారం అత్యంత ప్రభావవంతమైన వైవిధ్యభరిత పెట్టుబడి. చెడు సమయాల్లో ఇది ప్రత్యేకంగా బాగా పనిచేస్తుంది. మంచి సమయాల్లో అంతగా రాబడి ఇవ్వకపోవచ్చు. కానీ మొత్తం పోర్ట్‌ఫోలియో స్థిరత్వానికి ఇది కీలకమని డాలియో వివరించారు. అందుకే, పెట్టుబడిదారులు ప్రధానంగా బాగా వైవిధ్యభరితమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచం "మూలధన యుద్ధం అంచున" ఉందని కూడా డాలియో హెచ్చరించారు. "మనం ఇప్పుడే మూలధన యుద్ధంలో లేమనుకోండి, కానీ దానికి చాలా దగ్గరగా ఉన్నాం. పరస్పర భయాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆ అంచును దాటడం చాలా సులభం" అని ఆయన అన్నారు.
ఈ పరిణామాల మధ్య బుధవారం బంగారం ధరలుపెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయిని తిరిగి అందుకున్న బంగారం, బలమైన అమెరికన్ డాలర్ ఉన్నప్పటికీ 2 శాతానికి పైగా లాభపడింది. స్పాట్ బంగారం ధర 2.2 శాతం పెరిగి ఔన్సుకు 5,044.74 డాలర్లకు పైగానే చేరింది. ఇది నవంబర్ 2008 తర్వాత అతిపెద్ద రోజువారీ పెరుగుదలగా నమోదైంది. గత గురువారం బంగారం ధర ఔన్సుకు 5,594.82 డాలర్ల వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. అమెరికాలో ఏప్రిల్ డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 2.7 శాతం పెరిగి ఔన్సుకు 5,067 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications