బంగారం కొనేవారికి బిగ్ అలర్ట్.. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ముంచుకొస్తున్న కొత్త రిస్కులు!

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనివల్ల భారతదేశంలోకి గోల్డ్ దిగుమతులు భారీగా పెరిగి, విదేశీ మారకద్రవ్య నిల్వలపై (Forex Reserves) తీవ్ర ఒత్తిడి పడుతోంది. దేశ ప్రజలు అనవసరమైన గోల్డ్ ఇంపోర్ట్స్ , విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇంధనం, ఎరువుల వంటి అత్యవసర అవసరాల కోసం ఫారెక్స్ నిల్వలను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని 6% నుండి ఏకంగా 15%కి పెంచింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ కామత్ చేసిన ఒక ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. భారతీయ కుటుంబాల వద్ద నిరుపయోగంగా ఉన్న టన్నుల కొద్దీ బంగారాన్ని బయటకు తీసి, దానిని మానిటైజ్ చేయడానికి 'గోల్డ్-బ్యాక్డ్ స్టేబుల్‌కాయిన్' (Gold-backed Stablecoin) ఒక అద్భుతమైన మార్గమని ఆయన ప్రతిపాదించారు. కాయిన్‌స్విచ్ (CoinSwitch) కో-ఫౌండర్ ఆశిష్ సింఘాల్ సహాయంతో అసలు ఈ గోల్డ్ స్టేబుల్‌కాయిన్స్ అంటే ఏంటి? వీటితో లాభాలు ఎలా ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Gold Backed Stablecoin Future of Digital Gold Investing PAXG XAUT Nikhil Kamath

గోల్డ్-బ్యాక్డ్ స్టేబుల్‌కాయిన్స్ అంటే ఏమిటి?

సాధారణంగా క్రిప్టో మార్కెట్లో ఉండే USDT లేదా USDC వంటి సాంప్రదాయ స్టేబుల్‌కాయిన్స్ అమెరికన్ డాలర్ ($1:1$) విలువకు సమానంగా పనిచేస్తాయి. కానీ గోల్డ్-బ్యాక్డ్ స్టేబుల్‌కాయిన్స్ (ఉదాహరణకు: PAXG లేదా XAUT) డిజిటల్ రూపంలో ఉన్నప్పటికీ.. వాటి వెనుక వంద శాతం అసలైన ఫిజికల్ గోల్డ్ (బంగారు గట్టీలు) సెక్యూర్డ్ వాల్ట్‌లలో భద్రపరచబడి ఉంటుంది.
ప్రధాన వ్యత్యాసం: డాలర్ ఆధారిత కాయిన్స్ కేవలం డిజిటల్ క్యాష్ , లావాదేవీల కోసం ఉపయోగపడితే.. గోల్డ్-బ్యాక్డ్ టోకెన్లు మాత్రం ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటూ దీర్ఘకాలికంగా సంపదను దాచుకోవడానికి (Store of value) ఉపయోగపడతాయి. మార్కెట్లో కరెన్సీ విలువ మారినప్పుడు డాలర్ కాయిన్స్ మారవు కానీ, గోల్డ్ కాయిన్స్ మాత్రం నేరుగా అసలైన బంగారం (Gold) ధరలతో పాటే పెరుగుతుంటాయి.

ఎవరెవరు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు?

  • ద్రవ్యోల్బణం నుండి రక్షణ: రూపాయి విలువ తగ్గడం లేదా ద్రవ్యోల్బణం (Inflation) పెరగడం వల్ల తమ డబ్బు విలువ పడిపోకుండా చూసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
  • పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్: స్టాక్ మార్కెట్ , సాధారణ క్రిప్టో కరెన్సీల లాగా ఇవి విపరీతమైన హెచ్చుతగ్గులకు గురికావు. మార్కెట్లు పడిపోతున్నప్పుడు బంగారం ఎప్పుడూ రక్షణగా నిలుస్తుంది కాబట్టి, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా ఇది పనిచేస్తుంది.
  • తక్కువ రిస్క్ క్రిప్టో ఎంట్రీ: క్రిప్టో అసెట్స్ లోకి అడుగుపెట్టాలని ఉండి, రిస్క్ వద్దు అనుకునే కన్జర్వేటివ్ ఇన్వెస్టర్లకు.. వెనుక రియల్-వరల్డ్ గోల్డ్ సపోర్ట్ ఉన్న ఈ కాయిన్స్ ఒక సురక్షితమైన ప్రవేశ మార్గం.

ఇన్వెస్ట్ చేసే ముందు గమనించాల్సిన 2 ముఖ్యమైన రిస్కులు..

ఈ డిజిటల్ గోల్డ్ టోకెన్లలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలని ఆశిష్ సింఘాల్ సూచిస్తున్నారు..

  1. తక్కువ లిక్విడిటీ (Liquidity): ప్రస్తుత గ్లోబల్ మార్కెట్లో PAXG, XAUT వంటి గోల్డ్ టోకెన్ల మార్కెట్ పరిమాణం చాలా చిన్నది. దీనివల్ల అత్యవసర సమయాల్లో లేదా మార్కెట్ ఒత్తిడిలో ఉన్నప్పుడు వీటిని త్వరగా అమ్ముకోవడం (లిక్విడిటీ లోతు) కొంత కష్టం కావచ్చు.
  2. రెగ్యులేటరీ సవాళ్లు (Regulations): ఈ కాయిన్స్ కమోడిటీస్, సెక్యూరిటీస్ , డిజిటల్ అసెట్స్ (క్రిప్టో) మూడింటి కలయికగా ఉంటాయి. అందువల్ల వివిధ దేశాల ప్రభుత్వాలు , సెబీ (SEBI) లాంటి సంస్థలు తీసుకొచ్చే కొత్త నిబంధనలు, చట్టాల మార్పుల ప్రభావం నేరుగా ఈ మార్కెట్ కార్యకలాపాలపై పడే అవకాశం ఉంది.
  3. నిపుణుల తుది సలహా: భారతదేశంలో డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇవి సరికొత్త భవిష్యత్తుగా మారే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో కాకుండా, చిన్న చిన్న కేటాయింపులతో (Small allocations) స్టార్ట్ చేయడం మంచిది. ఈ అసెట్ స్ట్రక్చర్ , మార్కెట్ వాల్యూమ్స్‌పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే క్రమంగా పెట్టుబడులను పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+