బంగారం ధర రూ.3 లక్షలు.. వెండి రూ. 5 లక్షలు.. షాకిస్తున్న సుశీల్ కేడియా భవిష్యత్తు అంచనాలు..
Gold at Rs 3 Lakh, Silver to Triple? దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన ముహూర్తపు ట్రేడింగ్ వేళ భవిష్యత్తు మార్కెట్లపై ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, 'కెడియానామిక్స్' వ్యవస్థాపకుడు సుశీల్ కేడియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పసిడి ప్రియులతో పాటు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే 18 నెలల కాలంలో బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో పెరిగే అవకాశం ఉందని ఆయన సంచలన అంచనాలు వెల్లడించారు.
ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1.45 లక్షలకు పైగా ఉండగా.. రాబోయే రోజుల్లో ఈ ధరలు ఏకంగా రెట్టింపై రూ. 3 లక్షల మార్కును తాకే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1.8 లక్షలకు పైగా నడుస్తుండగా, అది 2.5 నుండి 3 రెట్లు పెరిగి రూ. 5 లక్షలకు పైగా చేరుకుంటుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడిని భారీగా నిల్వ చేసుకోవడం, ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే విలువైన లోహాల వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారని, ఫలితంగానే ఈ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటుందని విశ్లేషించారు.

అయితే ఒకవైపు బంగారం, వెండిపై భారీ ఆశాభావం వ్యక్తం చేసిన కేడియా.. ఈక్విటీ స్టాక్ మార్కెట్ల విషయంలో మాత్రం ఇన్వెస్టర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. గడచిన కొద్ది రోజుల్లో నిఫ్టీ కేవలం ఒకే వారంలో దాదాపు 1,000 పాయింట్లు పుంజుకున్నప్పటికీ, మార్కెట్లో ఎప్పుడైనా పెద్ద ఎత్తున దిద్దుబాటు లేదా కరెక్షన్ జరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను కుదేల్ చేస్తున్నాయని తెలిపారు.
ఇలాంటి అనిశ్చిత వాతావరణంలో ప్రస్తుత రికార్డు స్థాయిల వద్ద తొందరపడి లాంగ్ పొజిషన్లు తీసుకోవద్దని, స్వల్పకాలిక ట్రేడింగ్ చేయడం చాలా ప్రమాదకరమని సూచించారు. స్టాక్ మార్కెట్లో దీర్ఘకాలిక దృక్పథంతో ఉంటేనే నష్టపోకుండా ఉండగలరని వివరించిన ఆయన.. భారత బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరుపై మాత్రం తన నమ్మకాన్ని పునరుద్ఘాటించారు.
ఈ బ్యాంక్ చార్టులు టెక్నికల్‌గా బుల్లిష్ ట్రెండ్‌ను చూపిస్తున్నాయని పేర్కొంటూ దీనికి రూ.1,050 లక్ష్య ధరను నిర్దేశించారు. కాగా, నవంబర్ 8న జరిగిన ప్రత్యేక ముహూర్తపు ట్రేడింగ్‌లో మార్కెట్లు ప్రారంభంలో లాభపడినప్పటికీ, చివరలో అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ 25,000 మార్కు దిగువకు జారి స్వల్ప నష్టాలతో ముగియడం గమనార్హం.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications