బంగారం ధర భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది.. పసిడి ధరలపై ఏడు బ్రోకరేజీల కీలక అంచనాలు ఇవిగో..

Gold at a Crossroads: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు నిరంతరంగా క్షీణిస్తున్న నేపథ్యంలో.. పసిడికి ఎక్కడ మద్దతు స్థాయిలు లభిస్తాయి, తగ్గుదల ఎప్పుడు ఆగి తిరిగి పుంజుకుంటుందనే అంశంపై మదుపర్లు దృష్టి సారించారు. స్వల్పకాలంలో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది (2027) లోపు ధరలు బలంగా కోలుకుంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

శనివారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 490 మేర పడిపోయి రూ. 1,25,080 వద్దకు చేరింది. ధరలు వరుసగా తగ్గడం ఇది తొమ్మిదవ ట్రేడింగ్ సెషన్. నవంబర్ 9న నమోదైన రూ. 1,46,900 గరిష్ఠ స్థాయి నుండి బంగారం ఇప్పటివరకు రూ. 18 వేలకు పైగా (సుమారు 12 శాతం) క్షీణించగా.. ఈ ఏడాది రికార్డు గరిష్ఠమైన సుమారు రూ. 1.83 లక్షల స్థాయి నుండి దాదాపు 29 శాతం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 3,515 డాలర్ల వద్దకు చేరి.. సెప్టెంబర్ 2025 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయిని తాకింది.

Gold Price Forecast 2026 Gold Price Prediction Gold Rate Today Gold Price Target Gold Price 1 15 Lakh Gold Price 1 8 Lakh Seven Brokerage Firms Gold Forecast Gold Investment Outlook Gold Market Analysis Gold Price Outlook India Gold Price Projections International Gold Prices Gold Investment Precious Metals Market Gold Market News 2026 1 15 1 8

ప్రస్తుత క్షీణత నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన మద్దతు స్థాయిలను (Support Levels) గుర్తించాయి. నిర్మల్ బాంగ్, ఎస్‌ఎం‌సి (SMC) సంస్థలు 10 గ్రాముల బంగారానికి రూ. 1,25,000 వద్ద బలమైన కొనుగోలు మద్దతు లభించవచ్చని అంచనా వేస్తుండగా.. వెంచురా సెక్యూరిటీస్ రూ. 1,24,000, కోటక్ నియో రూ. 1,22,000, కేడియా అడ్వైజరీ సుమారు రూ. 1,21,500 (రూ. 1.21 లక్షల పైచిలుకు) స్థాయిలను కీలకమైనవిగా పేర్కొన్నాయి.

Also Read

ఈ ఐదు సంస్థల ప్రకారం ప్రస్తుత స్థాయిల నుండి భారీ పతనం ఉండకపోవచ్చు. దీనికి భిన్నంగా, ప్రభుదాస్ లిల్లాధర్ రూ. 1,17,000 వద్ద, ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రూ. 1,15,000 వద్ద మద్దతు స్థాయిలను అంచనా వేశాయి. అంటే ఈ సంస్థల ప్రకారం స్వల్పకాలంలో బంగారం మరింత బలహీనపడే అవకాశం ఉంది.

అయితే 2027లో బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల కంటే గణనీయంగా పుంజుకుంటాయని బ్రోకరేజ్ సంస్థల అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ వాటి మధ్య వ్యత్యాసం మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. అత్యధికంగా కేడియా అడ్వైజరీ 2027లో 10 గ్రాముల బంగారం రూ. 1,80,000 వరకు చేరుకోవచ్చని అంచనా వేసింది.

ఎల్‌కేపీ సెక్యూరిటీస్, ఎస్‌ఎం‌సి రూ. 1,70,000 స్థాయిని అంచనా వేయగా.. వెంచురా సెక్యూరిటీస్ రూ. 1,65,000, నిర్మల్ బాంగ్ రూ. 1,60,000, కోటక్ నియో రూ. 1,53,000 లక్ష్యాలను నిర్దేశించాయి. ప్
రధాన బ్రోకరేజ్‌లలో అతి తక్కువ అంచనాగా ప్రభుదాస్ లిల్లాధర్ 2027లో బంగారం ధర రూ. 1,46,000 వద్ద ఉండవచ్చని పేర్కొంది. మొత్తంగా చూసినట్లయితే 2027లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.46 లక్షల నుండి రూ. 1.80 లక్షల పరిధిలో కదలాడవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఈ పతనం నుండి బంగారం తిరిగి పుంజుకునే క్రమంలో మదుపర్లు ప్రధానంగా ద్రవ్యోల్బణ గమనం, వడ్డీ రేట్ల నిర్ణయాలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్ల డిమాండ్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు ద్రవ్యోల్బణం కూడా చల్లబడుతుందని అనేక బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయి. ఇది వచ్చే ఏడాది వడ్డీ రేట్లలో స్థిరత్వానికి లేదా రేట్ల తగ్గింపు అంచనాలకు దారితీసి, పసిడికి మళ్లీ బలమైన ఊపునిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+