బంగారం మార్కెట్ అర్థం కాకుండా తయాయింది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో మరెప్పుడు తగ్గుతాయో అంతు చిక్కడం లేదు. ఒక్కసారిగా పెరిగిన ధరలు సామాన్యుల గుండ్ గుభేల్ మనిపిస్తున్నాయి. అదే సమయంలో ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి సూపర్ అనిపిస్తున్నాయి. ఇక పెట్టుబడిదారులు అయితే లాభాలు వెనకేసుకున్న వాళ్లు కొందరయితే భారీ నష్టాలను మూటగట్టుకున్న వారు మరికొందరు ఉన్నాయి.
జనవరి నెలాఖరులో చారిత్రాత్మక గరిష్టాలను నమోదు చేసిన అనంతరం, ఇప్పుడు ఈ విలువైన లోహాల ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ పెట్టుబడిదారుడు, 'రిచ్ డాడ్, పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన పెట్టుబడి వ్యూహంపై కీలక వ్యాఖ్యలు చేశారు.గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు పడిపోతుండటంతో, పెట్టుబడిదారులు అయోమయంలో ఉన్నారు. ఇదే సమయంలో కియోసాకి తన X (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. ప్రస్తుతం తాను కొనుగోళ్లు చేయడం లేదని, సరైన స్థాయిలు వచ్చిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెడతానని స్పష్టం చేశారు.

నేను గతంలో 60 డాలర్ల వద్ద వెండి కొనడం మానేశాను. 6,000 డాలర్ల వద్ద బిట్‌కాయిన్ కొనడం ఆపేశాను. 300 డాలర్ల వద్ద బంగారం కొనడం మానేశాను. కొంత బంగారం, కొంత బిట్‌కాయిన్‌ను విక్రయించాను కూడా. మూలధన లాభాల పన్నులు చెల్లించడం నాకు ఇష్టం లేదు, అందుకే అమ్మకాలను సాధ్యమైనంత వరకు నివారిస్తాను. ప్రస్తుతం బంగారం, బిట్‌కాయిన్ కొత్త బాటమ్‌ల కోసం ఓపికగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.
తాను మళ్లీ ఈ ఆస్తుల్లో కొనుగోళ్లు ప్రారంభించినప్పుడు తన అనుచరులకు సమాచారం అందిస్తానని Kiyosaki చెప్పారు. అలాగే తన ప్రసిద్ధ రిచ్ డాడ్ పాఠంను మరోసారి గుర్తు చేశారు. మీ లాభం మీరు కొన్నప్పుడు వస్తుంది... మీరు అమ్మినప్పుడు కాదని వ్యాఖ్యానించారు.
కియోసాకి అభిప్రాయం ప్రకారం..ధరల హెచ్చుతగ్గుల కంటే పెద్ద సమస్య అమెరికా ఆర్థిక పరిస్థితి. అమెరికా జాతీయ రుణం అత్యంత ఆందోళనకరం. సామాజిక భద్రత, మెడికేర్ వంటి కార్యక్రమాలను కలిపితే నిజమైన అప్పు 38 డాలర్ల ట్రిలియన్ల నుంచి 250 డాలర్ల ట్రిలియన్ల వరకు ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓర్పు, అప్రమత్తత చాలా అవసరమని ఆయన హెచ్చరించారు.
తన పోస్ట్ చివర్లో.. భవిష్యత్తులో తాను ఏ ధరలకు కొనుగోలు చేయాలనుకుంటున్నాడో కూడా స్పష్టంగా చెప్పారు. వెండి 74 డాలర్ల వద్దకు వస్తే మరిన్ని కొనుగోలు చేస్తాను. బంగారం 4,000 డాలర్లకి వస్తే కొనుగోలు చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర తగినంత ఈథీరియం ఉంది, అవసరమైతే మరిన్ని కొంటానని తెలిపారు.ముందున్న రోజులు కఠినంగా ఉండవచ్చని.. పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని కియోసాకి సూచించారు. ఫెడరల్ రిజర్వ్ విధానాలు, రాజకీయ అస్థిరత, డాలర్ విలువపై అనిశ్చితి వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉండగా శనివారం బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.289 పెరిగి రూ.15,660 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.265 పెరిగి రూ.14,355 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.217 పెరిగి రూ.11,745 వద్ద ట్రేడ్ అవుతోంది.10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.2,890 పెరిగి రూ.1,56,600 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,650 పెరిగి రూ.1,43,550 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2.1700 పెరిగి రూ.1,17,450 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..

బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications