బంగారం ధరలు తగ్గి ఈ రేటు వద్దకు రాబోతున్నాయి.. కొనుగోలుకు రెడీగా ఉండాలంటున్న ఆర్థిక నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య భద్ర పెట్టుబడిగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఆ సుదీర్ఘ ర్యాలీకి ఇప్పుడు ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి. రికార్డు గరిష్టాలను తాకిన రెండు విలువైన లోహాలు, పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గణనీయంగా పడిపోయాయి.

ఈ వారం ప్రారంభంలో ఔన్సుకు దాదాపు 4,381 డాలర్లకు చేరుకున్న Gold ఇప్పుడు దాదాపు 10 శాతం తగ్గి 4,082 డాలర్ల వద్ద ఉంది. అదే సమయంలో, ఔన్సుకు 54.5 డాలర్లకు చేరుకున్న వెండి కూడా సుమారు 10 శాతం పతనం చెంది 48 నుంచి 49 డాలర్ల మధ్య పరిధిలో ట్రేడవుతోంది. ఈ పతనం అమెరికా డాలర్ బలపడడం, చైనా-అమెరికా వాణిజ్య చర్చల్లో పురోగతి, ప్రపంచ ఉద్రిక్తతలు కొంత సద్దుమణగడం వంటి కారణాలతో ముడిపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.

gold price crash silver price fall gold silver correction why gold prices falling gold silver market analysis US dollar strength rising bond yields precious metals decline global market volatility gold silver investors commodity sell-off gold market news silver crash reasons bullion prices inflation fears safe haven assets gold silver trend 2025 global economy impact gold silver technical analysis metals price prediction 2025

SS వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ.. ఇటీవలి గరిష్ట స్థాయిల వద్ద పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడంతో బంగారం, వెండి రెండూ స్వల్పకాలిక సరిదిద్దుబాటును ఎదుర్కొంటున్నాయి. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ పరిష్కారం, వడ్డీ రేట్లు స్థిరంగా ఉండే సంకేతాలు, డాలర్ బలపడడం వంటి అంశాలు Gold యొక్క సురక్షిత స్వర్గధామ ఆకర్షణను తగ్గించాయని వివరించారు.

ఆమె ప్రకారం బంగారం ధరలు ఔన్సుకు 43.80 డాలర్లు పరీక్షించిన తర్వాత దాదాపు 10 శాతం క్షీణించాయి. అయితే 39.50 డాలర్లు నుంచి 40.00 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉంది. అంటే 10 గ్రాములకు రూ. 2,10,000 చుట్టూ ఉంది. ఈ స్థాయి నిలిచినంత కాలం బంగారం క్రమంగా కోలుకుంటుంది. దీని కన్నా ముందు ధరలు రూ.1,25,000 నుంచి రూ. 1,27,000 మధ్య పరిధిలో కదిలే అవకాశం ఉందని అన్నారు.

వెండి విషయంలో ఆమె అంచనా ప్రకారం రూ.1,45,000 వద్ద మద్దతు, రూ.1,67,000 వద్ద నిరోధం ఉండవచ్చు. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 65 శాతం పెరిగిన నేపథ్యంలో, రెండు లోహాలు కూడా ఇప్పుడు సైడ్‌వైస్ కదలికను చూపే అవకాశం ఉందని సచ్‌దేవా పేర్కొన్నారు.

అమెరికా డాలర్ బలపడటంతో గురువారం బంగారం ధరలు మరింత తగ్గాయి. పెట్టుబడిదారులు ఇప్పుడు US ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేట్లపై వచ్చే నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నారు. దేశీయ మార్కెట్‌లో కూడా తగ్గింపు ధోరణి కొనసాగుతోంది. రికార్డు స్థాయిల నుండి బంగారం, వెండి ధరలు గణనీయంగా సరిదిద్దబడ్డాయి.

మెహతా ఈక్విటీస్ VP రాహుల్ కలాంత్రి మాట్లాడుతూ.. వాణిజ్య పురోగతి, రిస్క్ ఆస్తుల వైపు పెట్టుబడిదారుల ఆకర్షణ, భారతదేశంలో సీజనల్ డిమాండ్ మందగించడం. ఇవే ధరల పతనానికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. రెండు రోజుల పతనం తర్వాత ధరలు స్థిరపడుతున్నాయని అన్నారు.ఆయన ప్రకారం..

బంగారం మద్దతు (కొనుగోలు స్థాయి) రూ. 1,21,070 నుంచి రూ. 1,20,580 మధ్యలో;
నిరోధం (ఆపే స్థాయి) రూ. 1,22,350 నుంచి రూ. 1,23,000 మధ్యలో..
వెండి: మద్దతు రూ. 1,44,350- రూ. 1,43,450;
నిరోధం రూ. 1,46,850-రూ.1,47,780

ఈ కరెక్షన్ ర్యాలీ ముగింపు కాదని, తాత్కాలిక విరామం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కొనసాగుతుండగా, వడ్డీ రేట్ల కోతలపై ఆశలు బంగారం ధరలకు మద్దతు ఇస్తాయి. యుద్ధ భయాలు, ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నందున, దీర్ఘకాలికంగా బంగారం స్థిరమైన పెట్టుబడిగా మిగిలే అవకాశం ఉందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+