Gold Rate: క్రిస్మస్ రోజున షాక్ ఇచ్చిన గోల్డ్.. రూ.1000 పెరిగిన ధర, ఏపీ-తెలంగాణలో రేట్లివే..
Gold Price Today: నేడు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవుల పండుగ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది తమ ప్రియమైనవారికి పసిడి కానుకలు ఇవ్వాలని చూస్తుంటారు. ఇందుకోసం నేడు అనేక మంది షాపింగ్ చేసేందుకు బంగారు ఆభరణాల షాపులకు వెళుతున్న వేళ పసిడి ధరలు పెరుగుదలతో షాక్ ఇచ్చాయి. నిన్నటి వరకు తగ్గిన ధరలు నేడు తిరిగి పెరగటంపై కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ-తెలంగాణలో పెరిగి రిటైల్ విక్రయ ధరలను తప్పకుండా తెలుసుకునే షాపింగ్ చేయటానికి వెళ్లటం ఉత్తమం.
క్రిస్మస్ రోజు పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7100, ముంబైలో రూ.7100, దిల్లీలో రూ.7115, కలకత్తాలో రూ.7100, బెంగళూరులో రూ.7100, కేరళలో రూ.7100, పూణేలో రూ.7100, వడోదరలో రూ.7105, అహ్మదాబాదులో రూ.7105, జైపూరులో రూ.7115, లక్నోలో రూ.7115, మధురైలో రూ.7100, మంగళూరులో రూ.7100, నాశిక్ లో రూ.7103, మైసూరులో రూ.7100, అయోధ్యలో రూ.7115, బళ్లారిలో రూ.7100, గురుగ్రాములో రూ.7115, నోయిడాలో రూ.7115 వద్ద కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7745, ముంబైలో రూ.7745, దిల్లీలో రూ.7760, కలకత్తాలో రూ.7745, బెంగళూరులో రూ.7745, కేరళలో రూ.7745, పూణేలో రూ.7745, వడోదరలో రూ.7750, అహ్మదాబాదులో రూ.7750, జైపూరులో రూ.7760, లక్నోలో రూ.7760, మధురైలో రూ.7745, మంగళూరులో రూ.7745, నాశిక్ లో రూ.7748, మైసూరులో రూ.7745, అయోధ్యలో రూ.7760, బళ్లారిలో రూ.7100, గురుగ్రాములో రూ.7760, నోయిడాలో రూ.7760 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 పెరిగి రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications