Silver Vs Sensex: బులియన్ మార్కెట్- స్టాక్ మార్కెట్ మధ్య పోటీ కొనసాగుతోంది. వాస్తవానికి ఊహించింది ఒకటైతే జరుగుతోంది మరొకటి. అయితే వేటిలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులు అత్యధికంగా లాభపడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం..
2024లో స్టాక్ మార్కెట్‌కే కాకుండా బులియన్ మార్కెట్ కూడా ప్రతిరోజూ కొత్త చరిత్రను సృష్టిస్తోంది. సాధారణంగా స్టాక్ మార్కెట్ పెరిగినప్పుడు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఈ సారి ఆ సాంప్రదాయం కొనసాగలేదు. బంగారం, వెండి, సెన్సెక్స్, నిఫ్టీ ఒక్కసారిగా ర్యాలీలో కొనసాగటం ఇన్వెస్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై చాలా మంది నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బూమ్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుందనే ఆందోళనలు అలుముకున్నాయి.

ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం తన పెట్టుబడిదారులకు 13 శాతం రాబడిని అందించగా.. వెండి దాదాపు 8 శాతం వరకు లాభాన్ని ఆర్జించిపెట్టింది. మరో పక్క స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీల రాబడిని గమనిస్తే.. నిఫ్టీ సూచీ 4.65 శాతం, సెన్సెక్స్ 3.83 శాతం, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ దాదాపు 1.56 శాతం రాబడిని అందించాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలును కొనసాగించడం, ఇతర భౌగోళిక రాజకీయ పరిణామాలతో బులియన్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది.
రాజకీయ అనిశ్చితులతో పాటు వృద్ధి మందగమనంతో సురక్షితమైన స్వర్గధామ ఆస్తిగా బంగారం శాశ్వత ఆకర్షణ కూడా దాని బలానికి దోహదపడింది. ఇక వెండి విషయానికి వస్తే.. పరిశ్రమలలో డిమాండ్ పెరగడం, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలు, మార్కెట్ ఒత్తిళ్ల కారణంగా వెండి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ50, సెన్సెక్స్ అపూర్వమైన గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది బలమైన పెట్టుబడిదారుల సెంటిమెంట్, భారతదేశ ఆర్థిక అవకాశాలపై విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని PHDCCI వద్ద క్యాపిటల్ మార్కెట్స్ అండ్ కమోడిటీ మార్కెట్స్ కమిటీ చైర్మన్ BK సబర్వాల్ అన్నారు.


Click it and Unblock the Notifications