Gold Price Today: అక్షయతృతీయ తర్వాత వరుసగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ తాజా స్పీచ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు పెంచేసింది. దీంతో పతనంలో ఉన్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా తిరిగి పుంజుకున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు 4,000 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని వివిద నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.67,250, ముంబైలో రూ.67,150, దిల్లీలో రూ.67,300, కలకత్తాలో రూ.67,150, బెంగళూరులో రూ.67,150, కేరళలో రూ.67,150, వడోదరలో రూ.67,200, జైపూరులో రూ.67,300, మంగళూరులో రూ.67,150, నాశిక్ లో రూ.67,180, అయోధ్యలో రూ.67,300, బళ్లారిలో రూ.67,150, గురుగ్రాములో రూ.67,300, నోయిడాలో రూ.67,300 వద్ద కొనసాగుతున్నాయి. వీటికి పన్నులు ఇతర ఖర్చులను షాపులు అదనంగా విధిస్తాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4,300 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.73,360, ముంబైలో రూ.73,250, దిల్లీలో రూ.73,400, కలకత్తాలో రూ.73,250, బెంగళూరులో రూ.73,250, కేరళలో రూ.73,250, వడోదరలో రూ.73,300, జైపూరులో రూ.73,400, మంగళూరులో రూ.73,250, నాశిక్ లో రూ.73,280, అయోధ్యలో రూ.73,400, బళ్లారిలో రూ.73,250, గురుగ్రాములో రూ.73,400, నోయిడాలో రూ.73,400గా ఉన్నాయి. అయితే ఈ రేట్లకు షాపుల్లో జీఎస్టీ, అదనపు ఖర్చులు కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,250 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.400 పెరిగి రూ.91,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications