Gold Price Today: ఫిబ్రవరి మధ్య నుంచి బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారం ప్రతిరోజూ గోల్డ్ రేట్లు పెరగటం భారతీయ పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తోంది. యూఎస్ ఫెడ్ చైర్మన్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలను ఇవ్వటంతో పసిడి సరికొత్త గరిష్ఠాలకు చేరుకుని అందని ద్రాక్షగా మారిపోయింది.
తాజా గోల్డ్ ర్యాలీతో దేశంలోని అన్ని నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,000 మార్కును అధిగమించి షాక్ కొట్టిస్తోంది. బంగారం రేటు వినటం తప్ప కొనటం ఇకపై కుదరదని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర నేడు రూ.5000 పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.66,450, ముంబైలో రూ.64,600, దిల్లీలో రూ.64,750, కలకత్తాలో రూ.64,600, బెంగళూరులో రూ.64,600, కేరళలో రూ.64,600, వడోదరలో రూ.64,650, జైపూరులో రూ.64,750, మంగళూరులో రూ.64,600, నాశిక్ లో రూ.64,630, అయోధ్యలో రూ.64,750, బళ్లారిలో రూ.64,600, గురుగ్రాములో రూ.64,750, నోయిడాలో రూ.64,750 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు దేశంలోని ప్రముఖ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.71,400, ముంబైలో రూ.70,470, దిల్లీలో రూ.70,620, కలకత్తాలో రూ.70,470, బెంగళూరులో రూ.70,470, కేరళలో రూ.70,470, వడోదరలో రూ.64,650, జైపూరులో రూ.70,620, మంగళూరులో రూ.70,470, నాశిక్ లో రూ.70,500, అయోధ్యలో రూ.70,620, బళ్లారిలో రూ.70,470, గురుగ్రాములో రూ.70,620, నోయిడాలో రూ.70,620గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.64,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,470 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1,000 పెరిగి రూ.85,300 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications