బంగారం..బంగారమే: ధర మళ్లీ పైపైకే: త్వరపడటం మంచిదే
ముంబై: బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల చోటు చేసుకుంది. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు చెప్పుకోదగ్గ రేంజ్‌లోనే పెరిగాయి. కొద్దిరోజులుగా నేల చూపులు చూస్తూ వచ్చిన బంగారం ధరల గ్రాఫ్.. మళ్లీ పైపైకి ఎగబాకింది. బంగారం, వెండి ధరలు పెరుగుదల బాట పట్టడం వరుసగా ఇది మూడోసారి. పసిడి ధరల తగ్గుదల బుధవారం నాటితో ఆగిపోయింది. గురు, శుక్రవారాల్లో స్వల్పంగా పెరిగింది. శనివారం నాడు కూడా వాటి ధరల్లో అదే పరిస్థితి కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గరిష్ఠంగా 660 రూపాయలు, 24 క్యారెట్ల రేటులో 650 రూపాయల మేర పెరుగుదల నమోదైంది.
దేశ రాజధానిలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధరలో 600 రూపాయలు పెరుగుదల కనిపించింది. 44,400 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 48,440గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 43,900 రూపాయలు, 24 క్యారెట్ల రేటు 44,900 వద్ద పలుకుతోంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 42,250, 24 క్యారెట్లు 46,090 రూపాయల వద్ద నిలిచింది. విజయవాడ, విశాఖపట్నంలల్లో ఇదే రేటు నమోదైంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 42,250ల వద్ద స్థిరపడగా.. 24 క్యారెట్ల ధర 46,090, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్లు 46,090 రూపాయలుగా పలుకుతోంది.

ఈ పెరుగుదల మున్ముందు కొనసాగే అవకాశాలు లేకపోలేదని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం లావాదేవీలు పెరుగుదలతో క్లోజ్ అయ్యాయి. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు కావడం వల్ల ఎంసీఎక్స్‌లో లావాదేవీలు చోటు చేసుకోలేదు. ఫలితంగా ఏప్రిల్ నాటి ఫ్యూచర్ ట్రేడింగ్ 228 రూపాయల మేర పెరిగి 44,865 రూపాయల వద్ద నిలిచింది. వెండి ఫ్యూచర్ ట్రేడింగ్ 1226 రూపాయల పెరుగుదలతో కిలో ఒక్కింటికి 65,040 వద్ద ముగిసింది. ఇదివరకు 55,000 రూపాయలకు పైగా పలికిన పసిడి ధర ప్రస్తుతం తగ్గడం మధ్య తరగతి కుటుంబీలకు ఊరట కలిగించేదే.


Click it and Unblock the Notifications