Gold Price Today: అమెరికా ఫెడరల్ రిజర్వు అందరూ ఊహించిన మాదిరిగానే తొలి రేట్ కట్ ప్రకటించింది. ఈ ఊహాగానాలు మెుదలైన నాటి నుంచి గోల్డ్ రేట్లు పెరుగుదల కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే గడచిన మూడు రోజులుగా కొనసాగిన రేట్ల తగ్గింపులకు నేడు బ్రేక్ పడింది. దీంతో వారాంతంలో ఇంకా రేట్లు తగ్గితే కొనాలని ప్లాన్ చేస్తున్న చాలా మంది షాక్ అవుతున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా నేడు భారీగా గోల్డ్ రేట్లు పెరగటం భారతీయ పసిడి ప్రియులను నివ్వెర పరుస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6000 పెరుగుదలను నమోదు చేసి అందరినీ షాక్ కి గురిచేసింది. దీంతో నేడు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6885, ముంబైలో రూ.6885, దిల్లీలో రూ.6900, కలకత్తాలో రూ.6885, బెంగళూరులో రూ.6885, కేరళలో రూ.6885, పూణేలో రూ.6885, వడోదరలో రూ.6890, జైపూరులో రూ.6900, లక్నోలో రూ.6900, మంగళూరులో రూ.6885, నాశిక్ లో రూ.6885, అయోధ్యలో రూ.6900, బళ్లారిలో రూ.6885, గురుగ్రాములో రూ.6900, నోయిడాలో రూ.6900 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6,600 పెరిగింది. దీంతో దేశంలో ప్రముఖ నగరాల్లో నేటి గ్రాము ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7511, ముంబైలో రూ.7511, దిల్లీలో రూ.7526, కలకత్తాలో రూ.7511, బెంగళూరులో రూ.7511, కేరళలో రూ.7511, పూణేలో రూ.7511, వడోదరలో రూ.7516, జైపూరులో రూ.7526, లక్నోలో రూ.7526, మంగళూరులో రూ.7511, నాశిక్ లో రూ.7511, అయోధ్యలో రూ.7526, బళ్లారిలో రూ.7511, గురుగ్రాములో రూ.7526, నోయిడాలో రూ.7526గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6885గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7511 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,500 పెరిగి రూ.97,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2588 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.83 డాలర్ల వద్ద ఉంది. అలాగే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రూ.83.633 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఆగస్టులో ఇండియా ఏకంగా 10 బిలియన్ డాలర్లు విలువైన బంగారాన్ని దేశంలోకి దిగుమతి చేసుకోవటం లోహానికి పెరిగిన భారీ డిమాండుకు అద్దం పడుతోంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications