Gold Price Today: గడచిన కొన్ని రోజులుగా పసిడి ధరలు చాలా అనిశ్చితితో కొనసాగుతున్నాయి. వారంలో రెండు రోజులు తగ్గిన ధరల కంటే పెరుగుతున్న ధర ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో చాలా మంది పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ చాలా మంది ఆభరణాల షాపింగ్ చేయాలని చూస్తున్నప్పటికీ రేట్ల ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా రేట్లను పరిశీలిస్తే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ధర రూ.4500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.8065, ముంబైలో రూ.8065, దిల్లీలో రూ.8080, కలకత్తాలో రూ.8065, బెంగళూరులో రూ.8065, కేరళలో రూ.8065, పూణేలో రూ.8065, వడోదరలో రూ.8070, అహ్మదాబాదులో రూ.8070, జైపూరులో రూ.8080, లక్నోలో రూ.8080, కోయంబత్తూరులో రూ.8065, మంగళూరులో రూ.8065, నాశిక్ లో రూ.8068, అయోధ్యలో రూ.8080, బళ్లారిలో రూ.8065, గురుగ్రాములో రూ.8080, నోయిడాలో రూ.8080 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4,900 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8798, ముంబైలో రూ.8798, దిల్లీలో రూ.8813, కలకత్తాలో రూ.8798, బెంగళూరులో రూ.8798, కేరళలో రూ.8798, పూణేలో రూ.8798, వడోదరలో రూ.8803, అహ్మదాబాదులో రూ.8803, జైపూరులో రూ.8813, లక్నోలో రూ.8813, కోయంబత్తూరులో రూ.8798, మంగళూరులో రూ.8798, నాశిక్ లో రూ.8801, అయోధ్యలో రూ.8813, బళ్లారిలో రూ.8798, గురుగ్రాములో రూ.8813, నోయిడాలో రూ.8813గా ఉన్నాయి.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8065గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8798 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2000 పెరిగి రూ.1,09,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications