Gold Rate Today: వరుసగా రెండు రోజులుగా క్షీణించిన గోల్డ్ రేటు నేడు మార్కెట్లతో పాటు తిరిగి పుంజుకుంది. సహజంగా డాలర్ మారకపు విలువకు వ్యతిరేకంగా పసిడి పనిచేస్తుంటుంది. దీనికి తోడు వచ్చే నెలలో పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న వేళ కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర దేశంలో నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు 300 రూపాయలు పెరిగింది. దీంతో ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,100, ముంబైలో రూ.57,700, దిల్లీలో రూ.57,850, కలకత్తాలో రూ.57,700, కేరళలో రూ.57,700, పూణేలో రూ.57,700, వడోదరలో రూ.57,750, జైపూరులో రూ.57,850, కోయంబత్తూరులో రూ.58,100, పాట్నాలో రూ.57,750, నాశిక్ లో రూ.57,730, మైసూరులో రూ.57,700, బళ్లారిలో రూ.57,700, గురుగ్రామ్ లో రూ.57,850, నోయిడాలో రూ.57,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.330 పెరుగుదలను నమోదు చేసింది. వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.63,050, ముంబైలో రూ.62,950, దిల్లీలో రూ.63,100, కలకత్తాలో రూ.62,950, కేరళలో రూ.62,950, పూణేలో రూ.62,950, వడోదరలో రూ.63,000, జైపూరులో రూ.63,100, కోయంబత్తూరులో రూ.63,050, పాట్నాలో రూ.63,000, నాశిక్ లో రూ.62,980, మైసూరులో రూ.62,950, బళ్లారిలో రూ.62,950, గురుగ్రామ్ లో రూ.63,100, నోయిడాలో రూ.63,100గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, అనంతపురం, కడప, కర్నూలు, విశాఖ, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్‌లలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,700గా ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,950 వద్ద ఉంది. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.200 పెరిగి రూ.77,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications