Gold Rate: బంగారానికి ట్రంప్ శాపం.. నేడు ఒక్కసారిగా రూ.9100 పెరిగిన గోల్డ్ ధర, ఏమైందంటే..
Gold Price Today: ట్రంప్ రాకతో స్టాక్ మార్కెట్లలో ఆశావాదం పెరిగినప్పటికీ ఆందోళనలు సైతం అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. రానున్న కాలంలో ట్రంప్ అధ్యక్షతలో అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు వేయటం తద్వారా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగటం జరుగుతుందని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న వేళ నిన్న భారీగా తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ నేడు పుంజుకున్నాయి. దీనికి తోడు తాజాగా ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్ల కోతను స్పీడు తగ్గించటంతో పెట్టుబడిదారులు అప్రమత్తం అవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.8500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో నిన్నటి భారీ పతనం తర్వాత గోల్డ్ రేట్లు తిరిగి పుంజుకోవటం పెళ్లిళ్ల షాపింగ్ చేస్తున్నవారిలో ఆందోళనలు పెంచుతోంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7285, ముంబైలో రూ.7285, దిల్లీలో రూ.7300, కలకత్తాలో రూ.7285, బెంగళూరులో రూ.7285, కేరళలో రూ.7285, వడోదరలో రూ.7290, అహ్మదాబాదులో రూ.7290, జైపూరులో రూ.7300, లక్నోలో రూ.7300, మంగళూరులో రూ.7285, నాశిక్ రూ.7288, మైసూరులో రూ.7285, అయోధ్యలో రూ.7300, బళ్లారిలో రూ.7285, గురుగ్రాములో రూ.7300, నోయిడాలో రూ.7300గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.9100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7947, ముంబైలో రూ.7947, దిల్లీలో రూ.7962, కలకత్తాలో రూ.7947, బెంగళూరులో రూ.7947, కేరళలో రూ.7947, వడోదరలో రూ.7952, అహ్మదాబాదులో రూ.7952, జైపూరులో రూ.7962, లక్నోలో రూ.7962, మంగళూరులో రూ.7947, నాశిక్ రూ.7950, మైసూరులో రూ.7947, అయోధ్యలో రూ.7962, బళ్లారిలో రూ.7947, గురుగ్రాములో రూ.7962, నోయిడాలో రూ.7962 వద్ద నేడు రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7285గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7947 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications