Gold Rate Today: మూడు రోజుల తర్వాత మళ్లీ పెరిగిన బంగారం.. తులం రేటు ఎంతంటే
ఈ రోజు బంగారం ధరలు: గత నెల చివరి నుంచి వరుసగా మూడు రోజుప పాటు బంగారం ధరలు పతనం అయ్యాయి. ఈ క్రమంలో 10 గ్రాములకు రేటు దాదాపు రూ.1,000 క్షీణించిన సంగతి తెలిసిందే.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.100 మేర నేడు పెరిగాయి. దీంతో పండుగ సమయంలో బంగారం కొనాలనుకుంటున్న అనేక మంది హడావిడిగా షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.56,950, ముంబైలో రూ.56,500, దిల్లీలో రూ.56,650, కలకత్తాలో రూ.56,500, బెంగళూరులో రూ.56,500, కేరళలో రూ.56,500, పూణేలో రూ.56,500, వడోదరలో రూ.56,550, జైపూర్ లో రూ.56,650, మధురైలో రూ.56,950, నాశిక్ లో రూ.56,350, బళ్లారిలో రూ.56,500, నోయిడాలో రూ.56,650 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.110 నిన్నటి కంటే పెరిగింది. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో రిటైల్ రేట్లను ట్రాక్ చేస్తే.. చెన్నైలో రూ.62,130, ముంబైలో రూ.61,640, దిల్లీలో రూ.61,790, కలకత్తాలో రూ.61,640, బెంగళూరులో రూ.61,640, కేరళలో రూ.61,640, పూణేలో రూ.61,640, వడోదరలో రూ.61,690, జైపూర్ లో రూ.61,790, మధురైలో రూ.62,130, నాశిక్ లో రూ.61,670, బళ్లారిలో రూ.61,640, నోయిడాలో రూ.61,790గా కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, విశాఖ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, గుంటూరు, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, నిజాంబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 10 గ్రాములకు 22 క్యారెట్ల రేటు రూ.56,500గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.61,640గా కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.700 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి ధర కేజీకి రూ.77,700గా ఉంది.


Click it and Unblock the Notifications