Gold Price Today: వరుసగా రెండు రోజుల పాటు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు నేడు మళ్లీ తమ ర్యాలీని తిరిగి కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా నేడు పసిడి ధరలు మారాయి. వాస్తవానికి పెళ్లిళ్ల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఆభరణాలు షాపింగ్ చేయాలని చూస్తున్న వారికి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బగా ఉంది.
గతవారం నుంచి రేట్లు క్రమంగా పెరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు 22 క్యారెట్ల పసిడి ధరలు 100 గ్రాములకు నేడు రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ ధరలను గమనిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6690, ముంబైలో రూ.6635, దిల్లీలో రూ.6650, కలకత్తాలో రూ.6635, బెంగళూరులో రూ.6635, కేరళలో రూ.6635, వడోదరలో రూ.6640, జైపూరులో రూ.6650, లక్నోలో రూ.6650, నాశిక్ లో రూ.6638, మైసూరులో రూ.6635, అయోధ్యలో రూ.6650, బళ్లారిలో రూ.6635, గురుగ్రాములో రూ.6650, నోయిడాలో రూ.6650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు- చెన్నైలో రూ.7298, ముంబైలో రూ.7238, దిల్లీలో రూ.7253, కలకత్తాలో రూ.7238, బెంగళూరులో రూ.7238, కేరళలో రూ.7238, వడోదరలో రూ.7243, జైపూరులో రూ.7253, లక్నోలో రూ.7253, నాశిక్ లో రూ.7241, మైసూరులో రూ.7238, అయోధ్యలో రూ.7253, బళ్లారిలో రూ.7238, గురుగ్రాములో రూ.7253, నోయిడాలో రూ.7253 వద్ద విక్రయించబడుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,635గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,238 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.800 పెరిగి రూ.95,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications