Gold Rate Today: ఎట్టకేలకు భారతీయ పసిడి ప్రియుల కల నెరవేరింది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిణామాలు క్రమంగా చక్కబడటంతో ఆకాశానికి చేరిన గోల్డ్ రేట్లు కిందకు దిగివచ్చాయి. అందుకే శుభప్రదంగా భావించే దీపావళికి పసిడి ప్రియులు ఆభరణాలు షాపింగ్ చేసేందుకు క్యూ కడుతున్నారు.
ఈ క్రమంలో బంగారం ధరలు నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు మార్కెట్లో ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ రేటును పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,990, ముంబైలో రూ.55,540, దిల్లీలో రూ.55,690, కలకత్తాలో రూ.55,540, బెంగళూరులో రూ.55,540, కేరళలో రూ.55,540, వడోదరలో రూ.55,590, జైపూర్ లో రూ.55,690, కోయంబత్తూరులో రూ.55,990, మంగళూరులో రూ.55,540, నాశిక్‌లో రూ.55,570, బళ్లారిలో రూ.55,540, నోయిడాలో రూ.55,690 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలు వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,080, ముంబైలో రూ.60,590, దిల్లీలో రూ.60,690, కలకత్తాలో రూ.60,590, బెంగళూరులో రూ.60,590, కేరళలో రూ.60,590, వడోదరలో రూ.55,590, జైపూర్ లో రూ.55,690, కోయంబత్తూరులో రూ.61,080, మంగళూరులో రూ.60,590, నాశిక్‌లో రూ.60,620, బళ్లారిలో రూ.60,590, నోయిడాలో రూ.60,690గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, గుంటూరు, విశాఖ, అనంతపురం, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 గ్రాముల బంగారం ధర రూ.55,540 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,590 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీ రిటైల్ విక్రయ ధర రూ.76,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications