Gold Price Today: దేశంలో పెరుగుతున్న పసిడి ధరలు అటు వ్యాపారులను ఇటు కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా దేశంలో పసిడి కొనుగోలుదార్లు కొనాలా.. వద్దా.. అనే గందరగోళంలో ఉన్నారు.
22 క్యారెట్ల పసిడి ధరలు నేడు రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.67,800, ముంబైలో రూ.66,500, దిల్లీలో రూ.66,650, కలకత్తాలో రూ.66,500, బెంగళూరులో రూ.66,500, కేరళలో రూ.66,500, వడోదరలో రూ.66,550, జైపూరులో రూ.66,650, లక్నోలో రూ.66,650, మంగళూరులో రూ.66,500, నాశిక్‌లో రూ.66,530, అయోధ్యలో రూ.66,650, బళ్లారిలో రూ.66,500, గురుగ్రాములో రూ.66,650, నోయిడాలో రూ.66,650 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు దేశంలోని ప్రధాన నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.73,960, ముంబైలో రూ.72,550, దిల్లీలో రూ.72,700, కలకత్తాలో రూ.72,550, బెంగళూరులో రూ.72,550, కేరళలో రూ.72,550, వడోదరలో రూ.72,600, జైపూరులో రూ.72,700, లక్నోలో రూ.72,700, మంగళూరులో రూ.72,550, నాశిక్‌లో రూ.72,580, అయోధ్యలో రూ.72,700, బళ్లారిలో రూ.72,550, గురుగ్రాములో రూ.72,700, నోయిడాలో రూ.72,700గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,550 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను గమనిస్తే చాలా కాలం తర్వాత స్వల్పంగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధర కేజీకి రూ.500 తగ్గిన తర్వాత నేడు రూ.89,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications