Gold Rate: పసిడి ప్రియులకు భారీ షాక్.. నేడు ఏకంగా రూ.4900 పెరిగిన గోల్డ్, ఏపీ తెలంగాణ రేట్లివే..
Gold price Today: దేశీయంగా పసిడి ధరలు రెండు రోజుల బ్రేక్ తర్వాత భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో పండుగల షాపింగ్ ఆలస్యం చేస్తున్న వారికి పెద్ద దెబ్బ తగిలింది. దీపావళికి ముందు లక్ష్మీదేవి దీవెనలతో కొంత బంగారం కొనాలనుకుంటున్న చాలా మందికి పెద్ద నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. రోజురోజుకూ మారిపోతున్న పసిడి ధరలు నిజంగా కొనుగోలుదారుల్లో పెద్ద గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.4500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7140, ముంబైలో రూ.7140, దిల్లీలో రూ.7155, కలకత్తాలో రూ.7140, బెంగళూరులో రూ.7140, కేరళలో రూ.7140, వడోదరలో రూ.7145, జైపూరులో రూ.7155, లక్నోలో రూ.7155, మంగళూరులో రూ.7140, నాశిక్ లో రూ.7143, మైసూరులో రూ.7140, అయోధ్యలో రూ.7155, బళ్లారిలో రూ.7140, గురుగ్రాములో రూ.7155, నోయిడాలో రూ.7155 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4900 మేర పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7789, ముంబైలో రూ.7789, దిల్లీలో రూ.7804, కలకత్తాలో రూ.7789, బెంగళూరులో రూ.7789, కేరళలో రూ.7789, వడోదరలో రూ.7794, జైపూరులో రూ.7804, లక్నోలో రూ.7804, మంగళూరులో రూ.7789, నాశిక్ లో రూ.7792, మైసూరులో రూ.7789, అయోధ్యలో రూ.7804, బళ్లారిలో రూ.7789, గురుగ్రాములో రూ.7804, నోయిడాలో రూ.7804గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7789 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7789 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 పెరిగి రూ.1,02,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications