Gold Rate: పసిడి ప్రియులపై బాంబు.. షాకింగ్., ఒక్కరోజే రూ.7,700 పెరిగిన గోల్డ్ రేటు..
Gold Price Today: ఎన్నికల వేడి తగ్గగానే పసిడి ధరల్లో వేడి మెుదలైంది. వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు నేడు భారతీయులకు ఊహించని షాకిచ్చాయి. కొందాంలే అనుకుంటూ లేటుచేసిన వారు పెరిగిన రేటు చూసి నేడు షాక్ అవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.7 వేలు భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిద నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రేట్లను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.6,800, ముంబైలో రూ.6,730, దిల్లీలో రూ.6,745, కలకత్తాలో రూ.6,730, బెంగళూరులో రూ.6,730, కేరళలో రూ.6,730, వడోదరలో రూ.6,735, జైపూరులో రూ.6,745, మంగళూరులో రూ.6,730, నాశిక్ లో రూ.6,733, మైసూరులో రూ.6,730, అయోధ్యలో రూ.6,745, బళ్లారిలో రూ.6,730, గురుగ్రాములో రూ.6,745 వద్ద నేడు విక్రయించబడుతున్నాయి. వీటికి తయారీ, తరుగు, జీఎస్టీ వంటి అదనపు జోడింపులు ఉంటాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా ఒక్కరోజులోనే రూ.7,700 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7,418, ముంబైలో రూ.7,342, దిల్లీలో రూ.7,357, కలకత్తాలో రూ.7,342, బెంగళూరులో రూ.7,342, కేరళలో రూ.7,342, వడోదరలో రూ.7,347, జైపూరులో రూ.7,357, మంగళూరులో రూ.7,342, నాశిక్ లో రూ.7,345, మైసూరులో రూ.7,342, అయోధ్యలో రూ.7,357, బళ్లారిలో రూ.7,342, గురుగ్రాములో రూ.7,357గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,730గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,342 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,800 పెరిగి రూ.98,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications