Gold Price Today: భారత పసిడి ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. నేడు అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు పెరగటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది. వారాంతం దగ్గర పడుతున్న వేళ రేట్ల పెరుగుదల కొనుగోలుదారులను కంగారు పెడుతున్నాయి.
నేడు 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాము రేటు చెన్నైలో రూ.6700, ముంబైలో రూ.6640, దిల్లీలో రూ.6655, కలకత్తాలో రూ.6640, బెంగళూరులో రూ.6640, కేరళలో రూ.6640, వడోదరలో రూ.6645, జైపూరులో రూ.6655, మంగళూరులో రూ.6640, నాశిక్ లో రూ.6643, అయోధ్యలో రూ.6655, బళ్లారిలో రూ.6640, గురుగ్రాములో రూ.6655, నోయిడాలో రూ.6655 వద్ద విక్రయాలు కొనసాగిస్తున్నాయి. అయితే తయారీ, జీఎస్టీ, తరుగు, లాభాలు వంటి వాటి వల్ల ఒక్కో షాపులో రేటు వేరువేరుగా ఉంటుంది.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.2200 పెరుగుదలను నమోదు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాము రేటు చెన్నైలో రూ.7301, ముంబైలో రూ.7244, దిల్లీలో రూ.7259, కలకత్తాలో రూ.7244, బెంగళూరులో రూ.7244, కేరళలో రూ.7244, వడోదరలో రూ.7249, జైపూరులో రూ.7259, మంగళూరులో రూ.7244, నాశిక్ లో రూ.7247, అయోధ్యలో రూ.7259, బళ్లారిలో రూ.7244, గురుగ్రాములో రూ.7259, నోయిడాలో రూ.7259
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,640గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,244 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1500 పెరిగి రూ.97,100 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications