Gold Rate: పైపైకి పసిడి ధరలు.. శుక్రవారం రూ.4,300 పెరిగిన గోల్డ్, వీకెండ్ షాపింగ్ కష్టమే..!
Gold Price Today: దేశీయంగా బంగారం ధరలు అస్సలు బ్రేకులు లేకుండా పైపైకి పెరిగిపోతోంది. ఈ క్రమంలో భారతీయ పసిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును ప్రకటించిన తర్వాత నిరంతరాయంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న పసిడి ధరలు ప్రస్తుతం మధ్యతరగతి నుంచి ధనవంతుల వరకు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.4,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7100, ముంబైలో రూ.7100, దిల్లీలో రూ.7115, కలకత్తాలో రూ.7100, బెంగళూరులో రూ.7100, కేరళలో రూ.7100, వడోదరలో రూ.7105, జైపూరులో రూ.7115, మధురైలో రూ.7100, మంగళూరులో రూ.7100, నాశిక్ లో రూ.7103, అయోధ్యలో రూ.7115, బళ్లారిలో రూ.7100, గురుగ్రాములో రూ.7115, నోయిడాలో రూ.7115 వద్ద గ్రాముకు విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్లు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.4,300 అతిపెద్ద పెరుగుదలను నమోదుచేసింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7745, ముంబైలో రూ.7745, దిల్లీలో రూ.7760, కలకత్తాలో రూ.7745, బెంగళూరులో రూ.7745, కేరళలో రూ.7745, వడోదరలో రూ.7750, జైపూరులో రూ.7760, మధురైలో రూ.7745, మంగళూరులో రూ.7745, నాశిక్ లో రూ.7748, అయోధ్యలో రూ.7760, బళ్లారిలో రూ.7745, గురుగ్రాములో రూ.7760, నోయిడాలో రూ.7760గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,02,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ప్రస్తుత ధరల పెరుగుదలకు కీలక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. ఇది పరోక్షంగా మార్కెట్లలో ధరల పెరుగుదలకు దారితీస్తుంటాయి.


Click it and Unblock the Notifications