Gold Price Today: సామాన్యులపై యుద్ధం ప్రకటించిన పసిడి.. రోజురోజుకూ పెరిగిపోతున్న రేటు..
Gold Price Today: బంగారం రేట్లు విరామం తీసుకోకుండా పెరుగుతూ పోతున్నాయి. దీంతో కనీసం కాసు బంగారం కొనుక్కోవాలనే సామాన్యుల కోరికలు ఆవిరైపోతున్నాయి.
నేడు దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.300 మేర పెరిగింది. దీంతో వివిధ నగరాల్లో మారిన ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,300, ముంబైలో రూ.55,000, దిల్లీలో రూ.55,150, కలకత్తాలో రూ.55,000, బెంగళూరులో రూ.55,000, కేరళలో రూ.55,000, వడోదరలో రూ.55,050, జైపూర్ లో రూ.55,150, మధురైలో రూ.55,300, సూరత్‌లో రూ.55,050, నాశిక్‌లో రూ.55,030, వెల్లూరులో రూ.55,300గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో నేడు 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.330 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.60,000, దిల్లీలో రూ.60,150, కలకత్తాలో రూ.60,000, బెంగళూరులో రూ.60,000, కేరళలో రూ.60,000, వడోదరలో రూ.60,050, జైపూర్ లో రూ.60,150, మధురైలో రూ.60,330, సూరత్‌లో రూ.60,050, నాశిక్‌లో రూ.60,000, వెల్లూరులో రూ.60,330గా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నేటి తాజా గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. ఏపీలోని విజయవాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నంలలో 10 గ్రాములకు 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,000గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,000 వద్ద ఉంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కిలోపై రూ.500 పెరిగిన తర్వాత ఏపీ, తెలంగాణలో రూ.80,700 గా రిటైల్ విక్రయ ధరలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications