Gold Price Today: నిన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్ లోపు రేట్ల తగ్గింపు ఉంటుందనే ఆశావాదం పెరిగింది. ఇది పరోక్షంగా బంగారం ధరల పెరుగుదలకు నేడు దారితీసింది. అయితే నిన్న తగ్గినట్లే తగ్గి నేడు రేట్లు పెరగటంతో భారతీయు ఆందోళన చెందుతున్నారు.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నేడు ఏకంగా రూ.7000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను 10 గ్రాములకు గమనిస్తే.. చెన్నైలో రూ.67,150, ముంబైలో రూ.66,250, దిల్లీలో రూ.66,400, కలకత్తాలో రూ.66,250, కేరళలో రూ.66,250, వడోదరలో రూ.66,300, జైపూరులో రూ.66,400, మంగళూరులో రూ.66,250, నాశిక్ లో రూ.66,280, అయోధ్యలో రూ.66,400, బళ్లారిలో రూ.66,250, గురుగ్రాములో రూ.66,400, నోయిడాలో రూ.66,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు ఏకంగా నిన్నటితో పోల్చితే రూ.7,600 పెరిగి అక్షయతృతీయ సమీపిస్తున్న వేళ నిద్రలేకుండా చేస్తోంది. ఈ క్రమంలో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను 10 గ్రాములకు దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు గమనిస్తే.. చెన్నైలో రూ.73,250, ముంబైలో రూ.72,270, దిల్లీలో రూ.72,420, కలకత్తాలో రూ.72,270, కేరళలో రూ.72,270, వడోదరలో రూ.72,320, జైపూరులో రూ.72,420, మంగళూరులో రూ.72,270, నాశిక్ లో రూ.72,300, అయోధ్యలో రూ.72,420, బళ్లారిలో రూ.72,270, గురుగ్రాములో రూ.72,420, నోయిడాలో రూ.72,420గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 పెరిగి రూ.87,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications