Gold Rate Today: ముట్టుకోకుండానే షాక్ కొట్టిస్తున్న బంగారం.. ఇవాళ రేటు ఎంతంటే..??
Gold Price Today: అసలు బంగారం ధరలకు ఏమైందో అస్సలు తెలియటం లేదు. గోల్డ్ రేట్లను పరిశీలిస్తే తగ్గుతుంది రూపాయి పెరుగుతోంది పది రూపాయలు అన్నట్లుగా తయారైంది. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు అనూహ్యంగా భారీ పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో 10 గ్రాముల బంగారం రేటు నిన్నటి కంటే రూ.350 మేర పెరిగింది. తాజాగా పెరిగిన రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,300, ముంబైలో రూ.56,850, దిల్లీలో రూ.57,000, కలకత్తాలో రూ.56,850, బెంగళూరులో రూ.56,850, కేరళలో రూ.56,850, పూణేలో రూ.56,850, వడోదరలో రూ.56,900, జైపూరులో రూ.57,000, మంగళూరులో రూ.56,850, నాశిక్ లో రూ.56,880, బళ్లారిలో రూ.56,850, గురుగ్రామ్ లో రూ.57,000, నోయిడాలో రూ.57,000గా రిటైల్ మార్కెట్లలో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.380 మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,510, ముంబైలో రూ.62,020, దిల్లీలో రూ.62,170, కలకత్తాలో రూ.62,020, బెంగళూరులో రూ.62,020, కేరళలో రూ.62,020, పూణేలో రూ.62,020, వడోదరలో రూ.62,070, జైపూరులో రూ.62,170, మంగళూరులో రూ.62,020, నాశిక్ లో రూ.62,050, బళ్లారిలో రూ.62,020, గురుగ్రామ్ లో రూ.62,170, నోయిడాలో రూ.62,170 వద్ద ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కాకినాడ, విశాఖ, కర్నూలు, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,850 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,020గా విక్రయించబడుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.400 పెరిగి రిటైల్ మార్కెట్లో రూ.79,400 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications