Gold Rate Today: వార్‌జోన్‌లో ఉడికిపోతున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన నేటి రేట్లు ఇవే..
Gold Rate Today: మెున్నటి దాకా బాండ్ ఈల్డ్స్ పెరగటంతో పతనమైన పసిడి ధరలు యుద్ధ మేఘాలతో తిరిగి పుంజుకున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ పోరుతో గోల్డ్ రేట్లు భారీగా పెరగటం మెుదలు పెట్టాయి.
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు నిన్నటి కంటే రూ.300 పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.53,800, ముంబైలో రూ.53,650, దిల్లీలో రూ.53,800, కలకత్తాలో రూ.53,650, బెంగళూరులో రూ.53,650, కేరళలో రూ.53,650, వడోదరలో రూ.53,700, జైపూర్‌లో రూ.53,800, కోయంబత్తూరులో రూ.53,800, పాట్నాలో రూ.53,700, నాశిక్‌లో రూ.53,680, బళ్లారిలో రూ.53,650, గురుగ్రామ్‌లో రూ.53,800 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర నిన్నటి కంటే రూ.330 మేర పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,690, ముంబైలో రూ.58,530, దిల్లీలో రూ.58,680, కలకత్తాలో రూ.58,530, బెంగళూరులో రూ.58,530, కేరళలో రూ.58,530, వడోదరలో రూ.58,580, జైపూర్‌లో రూ.58,680, కోయంబత్తూరులో రూ.58,690, పాట్నాలో రూ.58,580, నాశిక్‌లో రూ.58,560, బళ్లారిలో రూ.58,530, గురుగ్రామ్‌లో రూ.58,680గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, గుంటూరు, విశాఖ, కడప, అనంతపురం, నిజాంబాద్, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.53,650గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.58,530 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక వెండి రేట్లను పరిశీలిస్తే.. స్థిరంగా కేజీ రూ.75,500 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications