Gold Price Today: అక్షయతృతీయకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో చాలా మంది భారతీయ పసిడి ప్రియులు అయోమయంలో ఉన్నారు. దీనికి తోడు వారికి షాకిచ్చేలా నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలు 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,400, ముంబైలో రూ.66,350, దిల్లీలో రూ.66,500, కలకత్తాలో రూ.66,350, బెంగళూరులో రూ.66,350, కేరళలో రూ.66,350, వడోదరలో రూ.66,400, జైపూరులో రూ.66,500, లక్నోలో రూ.66,500, నాశిక్ లో రూ.66,380, అయోధ్యలో రూ.66,500, బళ్లారిలో రూ.66,350, గురుగ్రాములో రూ.66,500, నోయిడాలో రూ.66,500, గోవాలో రూ.66,350 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.3,300 పెరిగాయి. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధర 10 గ్రాములకు గమనిస్తే.. చెన్నైలో రూ.72,430, ముంబైలో రూ.72,380, దిల్లీలో రూ.72,530, కలకత్తాలో రూ.72,380, బెంగళూరులో రూ.72,380, కేరళలో రూ.72,380, వడోదరలో రూ.72,430, జైపూరులో రూ.72,530, లక్నోలో రూ.72,530, నాశిక్ లో రూ.72,410, అయోధ్యలో రూ.72,530, బళ్లారిలో రూ.72,380, గురుగ్రాములో రూ.72,530, నోయిడాలో రూ.72,530, గోవాలో రూ.72,380గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,350గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,000 పెరిగి రూ.88,500 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications