Gold Rate Today: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి బంగారం రేటు ఏకంగా 10 గ్రాములకు రూ.1,000 వరకు పెరుగుతున్నాయి.
22 క్యారెట్ల బంగారం ధరలు 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.200 మేర పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.53,650, ముంబైలో రూ.53,350, దిల్లీలో రూ.53,500, కలకత్తాలో రూ.53,350, బెంగళూరులో రూ.53,500, కేరళలో రూ.53,350, వడోదరలో రూ.53,400, జైపూర్ లో రూ.53,500, కోయంబత్తూరులో రూ.53,650, మంగళూరులో రూ.53,500, నాశిక్ లో రూ.53,380, బళ్లారిలో రూ.53,500గా ఉన్నాయి.

ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.220 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.58,530, ముంబైలో రూ.58,200, దిల్లీలో రూ.58,350, కలకత్తాలో రూ.58,200, బెంగళూరులో రూ.58,200, కేరళలో రూ.58,200, వడోదరలో రూ.58,250, జైపూర్‌లో రూ.58,350, కోయంబత్తూరులో రూ.58,530, మంగళూరులో రూ.58,200, నాశిక్ లో రూ.58,230, బళ్లారిలో రూ.58,200 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు.. విజయవాడ, విశాఖ, నెల్లూరు, కడప, అనంతపురం, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ.53,350 వద్ద విక్రయిస్తుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,200 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి రేటు కేజీకి రూ.500 పెరగటంతో రూ.75,500 వద్ద రిటైల్ విక్రయాలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications