Gold Rate: కార్తీక పౌర్ణమికి పెరిగిన గోల్డ్ ధరలు.. 5 రోజుల తర్వాత రూ.1100 అప్, ఏపీ-తెలంగాణలో..
Gold Price Today: దేశీయంగా గడచిన 5 రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు నేడు తిరిగి పెరగటం ప్రారంభించాయి. కార్తీక పౌర్ణమికి గోల్డ్ ధరలు పెరగటంతో వారాంతంలో షాపింగ్ చేయాలని భావిస్తున్న చాలా మంది భారతీయులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. లేటు చేస్తే ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే అంశంపై క్లారిటీ లేకపోవటంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు ఎగబడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6945, ముంబైలో రూ.6945, దిల్లీలో రూ.6960, కలకత్తాలో రూ.6945, బెంగళూరులో రూ.6945, కేరళలో రూ.6945, పూణేలో రూ.6945, వడోదరలో రూ.6950, అహ్మదాబాదులో రూ.6950, జైపూరులో రూ.6960, లక్నోలో రూ.6960, మధురైలో రూ.6945, సూరత్ లో రూ.6950, మంగళూరులో రూ.6945, నాశిక్ లో రూ.6948, మైసూరులో రూ.6945, అయోధ్యలో రూ.6960, బళ్లారిలో రూ.6945, గురుగ్రాములో రూ.6960, నోయిడాలో రూ.6960 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విక్రయ ధరలు జీఎస్టీ, మజూరి, తరుగు, షాపు యజమానుల లాభాలు వంటివి కలపక ముందు రేట్లని గుర్తుంచుకోవాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7576, ముంబైలో రూ.7576, దిల్లీలో రూ.6960, కలకత్తాలో రూ.7576, బెంగళూరులో రూ.7576, కేరళలో రూ.7576, పూణేలో రూ.7576, వడోదరలో రూ.7581, అహ్మదాబాదులో రూ.7581, జైపూరులో రూ.7591, లక్నోలో రూ.7591, మధురైలో రూ.7576, సూరత్ లో రూ.7581, మంగళూరులో రూ.7576, నాశిక్ లో రూ.7579, మైసూరులో రూ.7576, అయోధ్యలో రూ.7591, బళ్లారిలో రూ.7576, గురుగ్రాములో రూ.7591, నోయిడాలో రూ.7591గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.6945గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7576 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6945గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7576 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది. పైన పేర్కొన్న ధరలకు జీఎస్టీ, తరుగు, వ్యాపారి లాభాలు, మజూరి వంటివి కలపకముందు రేట్లుగా గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications